వింక్ సెన్సేషన్ అనగానే గుర్తొచ్చే హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. కన్నుగీటడం ద్వారానే ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ మలయాళీ భామ నటించిన టాలీవుడ్ సినిమా ‘ఇష్క్’ ఈ నెల 30న విడుదల కానుంది. తెలుగులో ఇప్పటికే ఆమె నటించిన ‘చెక్’ ఫిల్మ్ విడుదల కాగా, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. కాగా, కెరీర్‌లో ఆ విషయంలో తనకేం బాధలేదని పేర్కొంటోంది ప్రియా ప్రకాశ్. ఇంతకీ ఆ విషయమేంటంటే..

కన్నుగీటడంలో ప్రియా ప్రకాశ్ ప్రత్యేకమైన ఫీచర్ కలిగి ఉందని అప్పట్లో నెటిజనాలు పేర్కొన్న సంగతి అందరికీ విదితమే. అయితే, వింక్ సెన్సేషన్ టైంలో ఆమెకు బోలెడన్నీ సినిమా ఆఫర్స్ వచ్చాయని ప్రియా పేర్కొంది. ఆ సమయంలో తనకు మూవీ ఆఫర్స్ కంటే స్టడీయే ముఖ్యమని అనిపించిందని, అందుకే వాటికి ఒప్పుకోలేదని ఈ క్యూట్ హీరోయిన్ తెలిపింది. ఈ క్రమంలోనే బీ.కామ్‌ పూర్తి చేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఇక అప్పట్లో వచ్చినన్నీ అవకాశాలు ఇప్పడు రాలేకపోవడంపై తనకేం బాధ లేదని ప్రియా చెప్తోంది. మలయాళ సినిమా‘ఇష్క్’ రీమేక్‌గా అదే పేరుతో తెలుగులో వస్తోంది. ఇందులో తేజా సజ్జా సరసన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటిస్తోంది. ఈ చిత్రం ఎస్‌.ఎస్‌ రాజు దర్శకత్వంలో రూపొందగా, ఆర్‌.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్‌ జైన్, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రియా ప్రకాశ్ మీడియాతో ముచ్చటించింది. రొటీన్ లవ్ స్టోరీలా ఈ సినిమా ఉండడని, డిఫరెంట్ అండ్ యూనిక్ కంటెంట్‌తో లవ్ స్టోరీ ‘ఇష్క్’ రాబోతున్నదని ప్రియా తెలిపింది. తనకు తెలుగు భాష అర్థమవుతుందని, త్వరలో పూర్తిగా తెలుగులో మాట్లాడుతానని ప్రియా చెప్పింది. డెరెక్టర్ రాజు గారితో వర్కింగ్ గుడ్ ఎక్స్‌పీరియెన్స్ అని వింక్ గర్ల్ తెలిపింది. ఈ సినిమా కాకుండా తెలుగులో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మాట్లాడుతూ – ‘‘మలయాళ ‘ఇష్క్‌’ చిత్రాన్ని చూసి తెలుగు రీమేక్‌ ‘ఇష్క్‌’ ఒప్పుకున్నాను. ఇది రోటీన్‌ లవ్‌స్టోరీలా ఉండదు. మలయాళ స్టోరీ సోల్‌ను తీసుకుని, ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్లు మార్పులు చేశారు దర్శకులు రాజుగారు. తెలుగు భాష అర్థం చేసుకోగలను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. ప్రస్తుతం తెలుగులో సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో కీ రోల్‌ చేస్తున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సుమంత్‌ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: