టాలీవుడ్ సినీ పరిశ్రమలో శ్రీహరికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన చనిపోయిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఆయన చనిపోయారు అని ఎవరు అనుకోవడం లేదు. ఇంకా అందరి మధ్య ఆయన ఉన్నట్లే ఫీల్ అవుతున్నారు.  విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీహరి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఏ పాత్రలో నటించిన తనదైన నటనతో ఆ పాత్రకు రక్తికట్టించే నటుడు శ్రీహరి. అలాంటి నటుడి ని కోల్పోవడం టాలీవుడ్ కి పెద్ద లోటు అనీ ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే అలనాటి డాన్సర్ డిస్కో శాంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

సమాజంలో అమ్మాయిలకు పోకిరి రాయుళ్ల బెడద ఎప్పటినుంచో ఉండగా ఇలాంటి సమస్యను శ్రీహరి భార్య డిస్కోశాంతి ఓ సందర్భంలో ఎదుర్కొన్నారు. అయితే అప్పటికీ ఆమెకు శ్రీహరితో పెళ్లి జరగలేదట. ఒకరకంగా చెప్పాలంటే ఆమె ఇంకా ఇండస్ట్రీ కి కూడా పరిచయం కాలేదనే చెప్పాలి. ఓసారి ఆమె తన చెల్లెలితో కలిసి సినిమా చూడడానికి వెళ్లారట. అక్కడ వెనుక వరుసలో కూర్చుని ఒకటే అల్లరి చేస్తున్నారట ముగ్గురు ఆకతాయిలు. వారిలో ఒకడు సినిమా మొదలయ్యాక శాంతి భుజం మీద చేయి వేయడంతో ఒక్కసారిగా తన కోపం కట్టలు తెంచుకుంది.  వెనక్కి తిరిగి చూసింది ఏం లాభం లేదు ఆ చీకట్లో ఏం ప్రయోజనం లేకపోయింది.

అయితే కొంత సమయం గడిచాక ఆమె కాలునీ ఎవరో తొక్కినట్లు అనిపించిందట. దాంతో ఆమెకు కోపం ఆగలేదు. వెనకాల ఉన్నవాడి చెంప చెళ్లుమనిపించింది. ఒక్క సారి గా అక్కడ కలకలం రేగింది. వెంటనే థియేటర్ లో సినిమా ఆపి వేశారు. ఏమైంది అని అందరూ అడగగా శాంతి అందరికీ విషయం చెప్పింది. అప్పుడు ఆ ముగ్గురిని అందరూ తిట్టడం మొదలు పెట్టారు. శాంతి చేతుల్లో దెబ్బతిన్న వాడి మీద పోలీసులకు ఫిర్యాదు చేయాలని శాంతి థియేటర్ వాళ్ళు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది.  ఆకతాయి వాళ్లను పోలీసులు అరెస్టు చేయగా శాంతి ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు  శాంతి వాళ్ళ ఇంటికి ఆ ఆకతాయి వచ్చి ఆమెను కేసు వాపసు తీసుకోమని బ్రతిమాలడం తో అతని మాటల్లో నిజాయితీ ముఖంలోకి దీనత్వం చూసి ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారట ఆమె. 

మరింత సమాచారం తెలుసుకోండి: