బాలీవుడ్ సినీ పరిశ్రమ దేశంలోనే అత్యుత్తమ, అతి పెద్ద సినిమా పరిశ్రమ. 4 రాష్ట్రాలను కలిపి ఉన్న సినిమా ఇండస్ట్రీ కావడంతో బాలీవుడ్ పెద్ద సినీ పరిశ్రమ అయింది. అందుకే అక్కడ భారీ బడ్జెట్ చిత్రాలు, పెద్ద పెద్ద భారీ తారాగణం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఎన్నో సినీ పరిశ్రమలకు మంచి సహకారం అందించిన సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్. ఇక్కడి సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతూ ఉంటాయి అంతే కాదు ఇతర భాషలో సినిమాలను కూడా ప్రోత్సహించడానికి ఎక్కడ రీమేక్ లు చేస్తూ ఉంటారు బాలీవుడ్ సినీ మేకర్స్.

అలాంటి బాలీవుడ్ ఎప్పటినుంచో పాటిస్తున్న ఓ విషయాన్ని టాలీవుడ్ ఇప్పుడు పాటిస్తుంది. అదేమిటంటే బాలీవుడ్ లో ప్రమోషనల్ సాంగ్ లు చేయడం మొదటి నుంచి అలవాటు. సినిమా అయిపోయిన తర్వాత ఈ ప్రమోషనల్ పాటను ప్రదర్శిస్తూ ప్రజలను ఎక్కువగా ఎంటర్ టైన్ చేస్తుంటారు. అలాగే సినిమా ప్రచారానికి ఈ పాటను భాగా వాడుతూ ఉంటారు. సినిమా లోని పాటలు ఎలా ఉన్నా కూడా ఈ ప్రమోషన్ సాంగ్ పై ఎంతో కాన్సంట్రేట్ బాగా చేసి సినిమా నీ విడుదల చేస్తారు. అలాంటి ప్రమోషనల్ సాంగ్ సినిమా నీ బాగా ప్రమోట్ చేయడంతో పాటు సినిమా హిట్ అవడానికి కూడా ఈ పాట ఎంతగానో ఉపయోగ పడుతోంది. 

ఈ ట్రెండ్ ను ఇటీవలే మన టాలీవుడ్ కూడా ప్రారంభించింది. రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కీరవాణి సంగీత సారథ్యంలో అయిదు భాషలకు చెందిన అయిదుగురు సంగీత దిగ్గజాలు ఓ ప్రమోషనల్ సాంగ్ ను చేయగా ఆగస్టు 1న విడుదల అవుతుంది ఆ పాట. అంతేకాకుండా తిమ్మరసు సినిమా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ సాంగ్ చేశారు. నితిన్ కూడా తన అప్ కమింగ్ సినిమా కోసం 50 లక్షలు ఖర్చు చేసి మరి ఓ ప్రమోషనల్ చేయించారట. చూడబోతే ఇది టాలీవుడ్లో ట్రెండ్ గా మారుతు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్ లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు లేకపోవడంతో ఈ తరహలో ప్రమోషన్ చేసి సినిమా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: