తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కడే వచ్చి మెగా స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ఇప్పుడు ఆయన తలుచుకుంటే యాభై కోట్ల వరకు పారితోషకం తీసుకొని సినిమా చేయగల రు. నిర్మాత లు కూడా అంతకంటే ఎక్కువే ఇచ్చి ఆయనతో సినిమాలు చేస్తారు. చిరు డేట్స్ ఇస్తే చాలు ఎంతైనా ఇవ్వడానికి రెడీ అనే నిర్మాతలు కోకొల్లలు ఉన్నారు. అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి ఇండియాలోనే తొలి సారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో గా రికార్డులకెక్కాడు.ఈ ఘనత ఆయనకే దక్కుతుంది. 

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమా కోసం చిరంజీవి కోటి రూపాయల పారితోషికం అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా తన రేంజ్ పెంచుకుంటూ రెమ్యునరేషన్ పెంచుకుంటూ వచ్చాడు. మెగాస్టార్ ను చూసి మిగిలిన హీరోలు సైతం కోటి రూపాయల పారితోషకం తీసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు దానికి 50 రేట్లు చిరు క్రేజ్ పెరిగింది. మూడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ స్థానంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి సైరా కోసం 30 కోట్ల రూపాయలు తీసుకోగా ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు 50 కోట్ల దాకా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట.

తన మొదటి సినిమాకి వెయ్యి నూటపదహార్ల రూపాయలు మాత్రమే పారితోషకం గా అందుకున్న చిరంజీవి 1978 లో పునాది రాళ్లు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని సుప్రీం హీరో గా మెగా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆచార్య అనే సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్, వేదాలమ్ రీమేక్ లో నటించనున్నాడు. ఇక బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: