దక్షిణాదిన భారీ చిత్రాలను తెరకెక్కించడంలో అందె వేసిన చెయ్యి దర్శకుడు శంకర్ ది. ఆయన చేసిన తొలి చిత్రం నుంచి భారీ చిత్రాలను చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆయన తెలుగువారికి కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా ఎంతో దగ్గర అయ్యాడు. దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ దర్శకులు ఎవరు అంటే శంకర్ పేరు కూడా చెబుతారు మన ప్రేక్షకులు. అలాంటి శంకర్ తెరకెక్కించిన సినిమా ఒకే ఒక్కడు. అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఓ మామూలు వ్యక్తి ఒకరోజు సీఎం అయితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ సినిమాను చిత్రీకరించి సూపర్ హిట్ కొట్టాడు.

సినిమా కథ ఎంతో కొత్తగా ఉండటంతో ఒకే ఒక్కడు సినిమాను తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విడుదల చేసి హిట్టు కొట్టాడు. తమిళ్లో ఒకే ఒక్కడు సినిమా కి ముడల్వన్ పేరు. ఆ తర్వాత నాయక్ పేరుతో హిందీలో కూడా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అర్జున్ పాత్రను అక్కడ అనిల్ కపూర్ చేయడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా రాణి ముఖర్జి నటించగా ఒరిజినల్ భాషలో మనిషా కొయిరాల నటించింది. అవినీతి గల సీఎంగా రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. 

సినిమా తర్వాత అర్జున్ టాలీవుడ్ లో కూడా నటుడిగా ఎదిగాడు. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నిజానికి ఈ సినిమాలో అర్జున్ ని తప్ప వేరే నటుడిని మనం ఊహించలేం. కానీ ఈ సినిమాకు మొదట శంకర్ అర్జున్ కాకుండా రజినీకాంత్ ను  హీరోగా సెలెక్ట్ చేసుకో గా ఆ సినిమా రజినీకాంత్ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కథను విజయ్ కి వినిపించగా అప్పటికే కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఈ సినిమాను చేయలేకపోయాడు. ఆ తర్వాత అర్జున్ హీరోగా ఈ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఆ సమయంలో విజయ్సినిమా వదులుకొని వేరే చిత్రాల్లో నటించగా భారీ ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. అది ఆయనకు ఎంతో మైనస్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: