తెలుగు చలన చిత్ర సీమకు ఎన్టీయార్, ఏయన్నార్ రెండు కళ్ళు అన్న సంగతి తెలిసిందే. ఎన్టీయార్ హీరో అయ్యాక చాలా తొందరగానే ప్రొడక్షన్ లోకి దిగిపోయారు. ఆ తరువాత నాగేశ్వరరావు కూడా అన్నపూర్ణ బ్యానర్ మీద ఎన్నో చిత్రాలు నిర్మించారు.

అయితే ఎన్టీయార్ తొలుత ఎన్ఏటీ బ్యానర్ మీద తన  తమ్ముడు త్రివిక్రమరావు తో కలసి సొంత సినిమాలు తీశారు. ఆ తరువాత రామక్రిష్ణా సినీ స్టూడియోస్ ని స్థాపించి దాని మీద అనేక చిత్రాలు తీశారు. ఇదిలా ఉంటే రామక్రిష్ణా బ్యానర్ మీద ఎన్టీయార్ చాణక్య చంద్రగుప్త అన్న చారిత్రాత్మక చిత్రాన్ని తీశారు. ఈ సినిమాలో అత్యంత కీలకమైన చాణక్య పాత్రను అక్కినేనికి ఇచ్చారు. అలా తన సొంత సినిమాలో అక్కినేని హీరోగా తీసుకోవడమే కాదు దర్శకత్వం కూడా వహించారు.

ఇక ఎన్టీయార్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1980 ప్రాంతంలో వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద సినిమా తీశారు. అదే సత్యం, శివం, ఈ మూవీలో ఎన్టీయార్ తో పాటు అక్కినేని మరో హీరోగా నటించారు. ఈ విధంగా చూస్తే ఇది కూడా ఎన్టీయార్ సొంత నిర్మాణ సంస్థ కిందనే లెక్క.  అలా ఎన్టీయార్ నిర్మాణ సంస్థలలో అక్కినేని వారు సినిమాలు చేస్తే తాను ఏయన్నార్ వేరు కాదని చాటి చెప్పారు ఎన్టీయార్.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎన్టీయార్ అక్కినేని మల్టీ స్టారర్లు డెబ్బై దశకం తరువాత చాలా వచ్చినా అవన్నీ సూపర్ డూపర్ హిట్ మాత్రం కాలేదు. ఒక మాదిరిగానే ఆడాయి. అలాగే ఎన్నో అంచనాల మీద వచ్చిన చాణక్య చంద్రగుప్త మూవీ కూడా సూపర్ హిట్ కాలేదు. మొత్తానికి ఈ సినిమాలు ఆ ఇద్దరి ఫ్యాన్స్ కి మాత్రం నచ్చేశాయి. దాంతో వారు మరిన్ని సినిమాలు తీయమనే కోరుకున్నారు. కానీ సరైన సబ్జెక్ట్ ఉంటేనే ఈ ఇద్దరు కలసి నటించేవారు.






మరింత సమాచారం తెలుసుకోండి: