దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో నటించాలని చిన్న సినిమా హీరో నుంచి పెద్ద సినిమాలో నటించే స్టార్ హీరో వరకు కోరిక ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి ప్రతి హీరోను తన సినిమాలో అద్భుతంగా చూపిస్తారనే విషయం తెలిసిందే. రాజమౌళి సినిమాలో చిన్న చిన్న పాత్రలలో నటించినా తమకు మంచి పేరు వస్తుందని చాలామంది నటీనటులు అనుకుంటారు. అయితే ఈ దర్శకుడి సినిమాలో హీరోగా నటించిన హీరోల తరువాత సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనే బాడ్ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ చాలా సార్లు నిజమయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ స్టూడెంట్ no 1 తరువాత వచ్చిన సుబ్బు సినిమా ప్లాప్ అయింది. అలాగే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషనులో వచ్చిన రెండవ సినిమా సింహాద్రి ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా అన్ని రికార్డులు తిరగ రాసింది. ఆ సినిమా తరువాత భారీ అంచనాలతో వచ్చిన ఆంధ్రవాలా ప్లాప్ అయింది. అదేవిధంగా ప్రభాస్ ఛత్రపతి సినిమా తరువాత చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే రాజమౌళి ఆ హీరోలను చూపించిన విధంగా  మిగతా దర్శకులు చూపించక పోవడంతో ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి అని ఒక వాదన వినిపిస్తుంది.చాలామంది దర్శకులు రాజమౌళి దర్శకత్వంలో లో నటించిన హీరోలతో సినిమాలు తెరకెక్కించి పరాజయాలను చవిచూశారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న రాంచరణ్, ఎన్టీఆర్ లతో తీస్తున్న సినిమాలు విజయం సాధించాల్సిన బాధ్యత కొరటాల శివపై పడింది.

RRR కంటే కొన్ని నెలల ముందుగానే ఆచార్య రి
విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో rrr తర్వాత విడుదల కానుంది.ఈ సినిమాతో రామ్ చరణ్ తో విజయం సాధించి కొరటాల శివ రాజమౌళి సెంటిమెంట్ ను తుడిచేయాలనీ చూస్తున్నాడు. rrr తర్వాత ఎన్టీఆర్ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యూనివర్సల్ కథతో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఆగష్టు రెండవ  వారం నాటికి rrr షూటింగ్ పూర్తి కానుండటంతో ఎన్టీఆర్ కొరటాల శివ మూవీకి సంబంధించిన ఇతర విషయాల గురించి స్పష్టత రానుందట. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవిలో ఈ సినిమా విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ సినిమా తో కూడా విజయం సాధించాల్సిన బాధ్యత కొరటాలపై ఉంది. కొరటాల శివ అన్ని జాగ్రత్తలు తీసుకుని రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలతో విజయం సాధిస్తాడో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: