తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది నటులు నిర్మాతగా అవతారం ఎత్తారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అటువంటి వారిలో ఒకరే ప్రముఖ నటుడు, కమెడియన్ మరియు రాజకీయ నాయకుడు అయిన బండ్ల గణేష్ అలాంటి వారిలో ఒకరు. బండ్ల గణేష్ నిర్మాతగా తన ప్రస్థానాన్ని 2009 లో ఆంజనేయులు సినిమాతో మొదలు పెట్టారు. అప్పటి నుండి 2015 లో వచ్చిన టెంపర్ వరకు మొత్తం ఎనిమిది సినిమాలను నిర్మించారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల తరువాత మళ్ళీ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ సినిమా కూడా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో తీయనున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రస్తుతం ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఎప్పుడెప్పడు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందా అని పవన్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అన్న ప్రశ్నకు కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లలో ఎవరిని తీసుకోవాలా అన్న సందిగ్ధంలో ఉండగా పవన్ కళ్యాణ్ దేవి శ్రీ ప్రసాద్ పేరును చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మంచి సాంగ్స్ వచ్చి ఉన్నాయి. అందుకే దేవికే ఓటు వేశారు.

ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ పలు సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ దూసుకుపోతున్నాడు. తమకు బాగా కలిసొచ్చిన దేవి శ్రీ ప్రసాద్ నే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సఖి, పుష్ప, ఖిలాడీ, ఆడవాళ్లు మీకు జోహార్లు, f3 మరియు రామ్ లింగుస్వామి మూవీకి కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఇప్పటికి అయితే ఇది ఒక మంచి గాసిప్ గా ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: