బాలీవుడ్‌లో దూసుకు పోవాలని బెల్లంకొండ దూకుడు చూపిస్తున్నాడు . ఇప్పటికే ప్రభాస్ 'ఛత్రపతి' సినిమాని వినాయక్ దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి చెప్పుకుంటే అల్లుడు శీను' సినిమాతో టాలీవుడ్ అడుగు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇపుడు బాలీవుడ్‌లో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ 'ఛత్రపతి' సినిమాని హిందీలో వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో అత్యంత గ్రాండ్‌గా రీమేక్ చేయనున్నాడు.రాజమౌళి సినిమా 'ఛత్రపతి' గురించి చెప్పుకుంటే ఈ సినిమాలో ప్రభాస్ 'ఛత్రపతి'గా మారి శత్రువుల నుండి తన వారిని ఎలా కాపాడుకున్నాడో అనే కాన్సెప్టే ఈ సినిమా కథ. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తన హిందీ డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈయన హిందీ డబ్బింగ్ సినిమాలకు 100 మిలియన్స్ కొద్దీ వ్యూస్ రావడం జరిగింది.

ఇప్పటికే హిందీ ప్రేక్షకులకు బెల్లంకొండ అంటే ఎవరో తెలిసిపోయింది. అందుకే మంచి సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ ప్రేక్షకులను కనువిందు  చేసే ప్రయత్నంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. ఈ బాలీవుడ్ సినిమా ద్వారా బెల్లంకొండ పాన్ ఇండియా హీరో కావాలనే ఆశక్తిగా ఉన్నాడట.వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఛత్రపతి' సినిమా చేస్తోన్న బెల్లంకొండ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'ఆది' సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సినిమాకు బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహారించారు. ఈ సినిమా హక్కులు బెల్లంకొండ సురేష్ దగ్గరే ఉన్నాయట. అందుకే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో మళ్ళీ వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో తండ్రి కొడుకులు వున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది . మొత్తంగా బాలీవుడ్‌లో ఒక సినిమా విడుదల కాకముందే బెల్లంకొండ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకోవడం తెలుగు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆది సినిమాను రీమేక్ చేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: