రాశి. తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే పేరు ఇది. ఎందుకంటే బాల నటి నుంచి ప్రముఖ తెలుగు హీరోయిన్ గా వెండితెరపై వెలుగులు చిమ్మిన మహానటి రాశి. ముఖ్యంగా శుభాకాంక్షలు, ప్రేయసిరావే, గోకులంలో సీత లాంటి సినిమాలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. రాశి నటన కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీ, తమిళ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకొని అందులో విజయం సాధించారు. హీరోయిన్ గానే తన కెరీర్ ను సాగించలేదు.. క్యార్టర్ ఆర్టిస్టుగాను రాణించారు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి సినిమాలకు దూరమయ్యారు. అరకొర సినిమాల్లో నటించారు.

రాశీ అసలు పేరు రవళీ అట. చిత్ర పరిశ్రమకు విజయలక్ష్మిగా పరిచయమయ్యారు. అయితే ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఆమెకు రాశీ అనే పేరు పెట్టారు. శుభాకాంక్షలు సినిమా సమయంలో ఇలా ఆమె పేరు మారిపోయింది.

రాశి చెన్నైలో పుట్టారు. ఆమె తండ్రిది చెన్నై కాగా.. తల్లి స్వస్థలం భీమవరం. తన తాతగారు జూనియర్ ఆర్టిస్టులను సినిమాలకు పరిచయం చేసేవారట. ఇక ఆమె తండ్రి బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించనట్టు ఆమె పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇక బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రాశి తొలుత పదోతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కథానాయిక అయిన తర్వాత బీఏ పూర్తి చేశారు.

అయితే ఈ రోజు రాశి బర్త్ డే ఆయినా ఆమె.. పుట్టిన రోజు జరుపుకోరు. ఎందుకంటే ఇదే రోజు తన తండ్రి చనిపోయారు. తనకు 18ఏళ్ల వయసున్నప్పుడు రాశి ఊటీలో.. విజయ్ కాంత్ సినిమా షూటింగ్ లో  బిజీబిజీగా గడుపుతూ ఉన్నారు. తన బర్త్ డే నాడు.. తండ్రి ఎప్పుడూ రాత్రి 12గంటలకు ఫోన్ చేసి విషెస్ చెప్పేవారు. అయితే ఆ రోజు మాత్రం తన తండ్రి నుంచి ఫోన్ రాలేదు. ఇక సినిమా వాళ్లు మాత్రం ఆమె కోసం కేక్ తెప్పించి రెడీగా ఉంచారు. కానీ ఆమెలో టెన్షన్ మొదలైంది. తర్వాత కోయంబత్తూరు కారులో వెళ్తుండగా.. తన ఇంటి నుంచి రాశికి ఫోన్ వచ్చింది. తన తండ్రి అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తే.. డ్రైవర్ లైన్ లోకి వచ్చారు. తన అన్నయ్యకు ఫోన్ ఇవ్వాలని చెప్పడంతో ఆమెలో గుబులు మొదలైంది. చివరకు విషాద వార్త తెలిసిపోయింది. తన తండ్రి చనిపోయాడని చెప్పడంతో షాక్ కు గురయ్యారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అప్పటి నుంచి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు రాశి.


మరింత సమాచారం తెలుసుకోండి: