దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టికి దుల్కర్ సల్మాన్ కుమారుడు అవుతారు. అయితే తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినిమాలు చేయడం దుల్కర్ కి ఇష్టం ఉండదట. తన తండ్రి సూపర్ స్టార్ కావడంతో తనకు మొదటి సినిమాలో నటించే అవకాశం వెంటనే లభించిందని ఆయన చెబుతుంటారు. కానీ సినిమాల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటానని.. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఆయన అంటుంటారు. తన తండ్రితో కలిసి సినిమా చేసే అవకాశం ఏమీ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. తనకి, తన తండ్రికి మధ్య పోలికలు చేసే అవకాశాన్ని ఎవరికీ కల్పించాలని ఆయన అన్నారు. ఇక ఆయన నటించిన ఉత్తమ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

1. సోలో:

భూమి, అగ్ని, గాలి, నీరు అంశాలను కలబోసి చేసిన ఆంథాలజీ చిత్రమే సోలో. ఈ చిత్రంలో 4 ఇండిపెండెంట్ స్టోరీస్ ఉంటాయి. అయితే ఈ 4 కథలలో కూడా దుల్కర్ సల్మానే కనిపిస్తారు. భగ్న ప్రేమికుడిగా, ప్రతీకారం తీర్చుకునే వైద్యుడుగా, రక్త సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చేవాడిలా కనిపిస్తారు. ఇక 4వ స్టోరీలో అక్రమ సంబంధాల మధ్య నలిగిపోతున్న ఒక యువకుడిలా కనిపిస్తారు. 2 గంటల 34 నిమిషాల పాటు సాగే ఈ సినిమా ఆద్యంతం రసవత్తరంగా ఉంటుంది. ఈ సినిమాతోనే దుల్కర్ సల్మాన్ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.

2. మహానటి:

సావిత్రి నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్ర పోషించారు. ఈ చిత్రంతో ఆయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.

3. ఓ కాదల్ కన్మణి:

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఒక వీడియో గేమ్ డెవలపర్ గా నటించారు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఆయన అద్భుతమైన నటనా ప్రదర్శన కనబరిచి ఆశ్చర్యపరిచారు.

4.కార్వాన్:

రోడ్డు కామెడీ డ్రామాగా తెరకెక్కిన హిందీ ఫిలిం కార్వాన్ లో దుల్కర్ సల్మాన్ నటించారు. విభిన్నమైన స్టోరీతో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

5. జోయా ఫాక్టర్:

ఈ చిత్రంలో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా నటించిన దుల్కర్ సల్మాన్ సోనమ్ కపూర్ ని ప్రేమిస్తుంటారు. అయితే సోనమ్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి లక్కీ చామ్ అని అందరూ భావిస్తుంటారు. ఆమె క్రికెట్ దేవతా అని.. ఆమెతో ఇండియన్ క్రికెట్ టీం మాట్లాడితే చాలు ఆ రోజు మ్యాచ్ గెలిచినట్టేనని విశ్వసిస్తుంటారు. దుల్కర్ మాత్రం ఇవన్నీ వట్టి మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు. దీంతో హీరో,హీరోయిన్ మధ్య చిన్నపాటి గొడవలు వస్తుంటాయి. కానీ చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: