టాలీవుడ్ సినీ పరిశ్రమలో యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమా నేటితో ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ పూర్తిస్థాయి హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి గొప్ప విజయాన్ని అందుకుంది. 2016వ సంవత్సరంలో విడుదలైన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా రివ్యూ ల పరం గా ప్రేక్షకులను మెప్పించి మంచి స్పందన దక్కించుకుంది.రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ముఖ్యపాత్రల్లో ప్రియదర్శి నటించి ప్రేక్షకులకు మంచి కామెడీని పండించాడు. బిగ్ బెన్ సినిమాస్, ధర్మపథ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా చిన్న బడ్జెట్ తో తెరకెక్కి భారీ లాభాలను రాబట్టుకుంది. ఇంజనీరింగ్ చదువుకున్న  జీవితంలో ఏం చేయాలన్న దానిపై స్పష్టత లేని హీరో   పెళ్లి చూపులకి వెళ్లగా అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటారు కానీ అది రాంగ్ పెళ్లిచూపులు కావడంతో వారిద్దరి మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది.

హీరోయిన్ పాత్ర హీరో పాత్రకు పూర్తిగా డిఫరెంట్. జీవితంలో ఏం సాధించాలన్నా దానిపై స్పష్టమైన దృష్టితో ఉంటూ తన కలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అలా ఓ అబ్బాయి తో ప్రేమలో పడి అతనితో కలిసి రెస్టారెంట్ ప్రారంభించి తన కల నెరవేర్చుకోవాలని ఆశిస్తుంది. కానీ అతను మధ్యలోనే వెళ్లిపోతాడు. ఈలోగా పెళ్లి చూపుల్లో హీరో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆమెతో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసాడు.  ఈ క్రమంలో వారు ఏ విధంగా తమ హోటల్ బిజినెస్ ను విజయవంతం చేస్తారనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఉవ్వెత్తున ఎగిసిన కెరటం లా టాలీవుడ్ హీరోలందరినీ దాటుకుంటూ స్టార్ హీరోగా అవతారమెత్తాడు. ప్రస్తుతం లైగర్ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్. దీని తర్వాత దేవరకొండ ప్రభంజనం ఎక్కడికి సాగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: