అలనాటి స్టార్ హీరోయిన్ లలో కుష్బూ కూడా ఒకరు. ఈమె తన అందంతోనే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈమె కోలీవుడ్ లో కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే ఈమె తన  కూతుర్ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందా..? లేదా..? అనే వివరాలను తెలుసుకుందాం.

ఖుష్బూ సినీ ఇండస్ట్రీలో ఏదైనా సరే  స్ట్రైట్ గా మాట్లాడే వ్యక్తి. ఆమె అలా మాట్లాడడం చేత కొంత మంది స్టార్ హీరోలు ఆమె తో మాట్లాడాలంటే భయపడేవారు. తన మీద కామెంట్ చేసిన వ్యక్తులపై చాలా ఘాటుగా సమాధానం ఇస్తుంది ఖుష్బూ. ఇక సినీ ఇండస్ట్రీ కి చెందిన ఒక ప్రముఖ యాక్టర్ కు.. తను అడిగిన కమిట్మెంట్ కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఆమె.కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె, ఇప్పుడు ప్రజల సేవకై రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పై పోరాటం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తనకు నచ్చిన పాత్రలు ఏదైనా కథ విన్నప్పుడు వుంటే, ఆ సినిమాలలో నటిస్తుంది కుష్బూ. ప్రస్తుతం ఈమె కూడా సోషల్ మీడియాకు బాగా దగ్గరగానే ఉంటుంది.తాజాగా తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ,ఆమె ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. తన కూతురు అందం ముందు ఖుష్బూ తేలిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోటో పెట్టిన వెంటనే అతి తక్కువ సమయంలోనే 30 వేల లైకులు, కామెంట్లు వచ్చాయి. కొంతమంది అప్పట్లో ఖుష్బూ కూతురు అందవిహీనంగా వుండేది.. దాంతో అప్పట్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు కొందరు.ప్రస్తుతం ఈమెను చూస్తే ఇప్పుడు సినీ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన"అన్నాదే" అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈమె కూతురు కూడా హీరోయిన్ గా వచ్చే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలో వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: