హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై యాష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2. మూడేళ్ళ క్రితం పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కెజిఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చాప్టర్ 2 మూవీ మొదటి భాగం మించి మరింత భారీ స్థాయిలో అత్యధిక ఖర్చు, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్నట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా తీస్తున్నారని, భారీ స్టార్ క్యాస్టింగ్ తో పాటు గ్రాండియర్ లుక్స్, యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో అదిరిపోతాయని ఇన్నర్ వర్గాల టాక్. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఎంతటి ఘనమైన రెస్పాన్స్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాలో మెయిన్ విలన్ అధీరా అనే పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు ఆయన జన్మదినం సందర్భంగా యూనిట్ విడుదల చేసింది.

రగ్డ్ లుక్ లో చేతిలో భారీ కత్తిని పట్టుకుని అధీరా లుక్ లో నడిచి వస్తున్న సంజయ్ దత్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని, త్వరలో సినిమా విడుదలకు సంబంధించి అఫీషల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు టాక్. మరి రేపు విడుదల తరువాత ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి .... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: