సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ సర్వసాధారణం. కొన్నిసార్లు భారీ హిట్లు అందుకున్న దర్శకనిర్మాతలకు ఇంకొన్నిసార్లు అదే రేంజ్ లో ఫ్లాప్ లు తప్పవు. మరికొంతమంది ఇది వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతారు. కారణం ఏదైనా ఆ దర్శక నిర్మాతలు అలాంటి పరిస్థితుల్లో డిప్రెషన్ కు లోనవుతుంటారు. ఇంకొంతమంది హిట్ కొట్టే దాకా గట్టిగా ప్రయత్నిస్తారు. ఇక మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందిని మాత్రం మొదటి సినిమా నుంచే దురదృష్టం వెంటాడుతుంది. పట్టుదల ఉన్న డైరెక్టర్స్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మరో ప్రయత్నం చేస్తుంటారు. కానీ దర్శకుడు మాత్రం మొదటి సినిమా పరాజయంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మొదటి సినిమానే అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో ఏకంగా చచ్చిపోవాలి అనుకున్నాడట.

విషయంలోకి వస్తే 'ఢిల్లీ 6' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. ఇందులో అభిషేక్ బచ్చన్, సోనం కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ రెహమాన్ మంచి సంగీతాన్ని సమకూర్చారు. అయినప్పటికీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది. 2016లో సూపర్ హైట్ తో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా బొక్క బోర్లా పడింది. ఈ సినిమా మా రిలీజ్ అయ్యి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయింది. కానీ తాజాగా ఆ సమయంలో దర్శకుడు ఎలా ఫీల్ అయ్యాడు అనే విషయం బయటకు వచ్చింది. దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తన ఆత్మకథలో విచిత్రం వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను అని వెల్లడించాడు. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి మద్యానికి బానిసయ్యాడట. కానీ అతని కుటుంబం, స్నేహితుల కారణంగా ఈ సమస్య నుండి త్వరగానే బయట పడ్డాడు. మొత్తానికి గండం గడిచింది. తాజాగా రాకేష్ 'తుఫాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: