టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని సినిమాలకు విడుదలయ్యే యోగ్యం ఉండదు. ఏవో కొన్ని కారణాల వల్ల  సినిమాలు అధికారికంగా ప్రకటించబడి విడుదలకు నోచుకోవు. పెద్ద హీరోల సినిమాలు సైతం అధికారికంగా ప్రకటించబడి మధ్యలో ఆగిపోయినవి షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల కానివి ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలోనీ పదకొండు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన బి గోపాల్ దర్శకత్వంలోని సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. పవన్ కళ్యాణ్ సొంత దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో అధికారికంగా ప్రకటించబడిన చిత్రం సత్యాగ్రహి. ముహూర్తం తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.

నందమూరి బాలకృష్ణ నర్తనశాల సినిమాను తెరకెక్కించాలని అధికారికంగా ప్రకటించగా సౌందర్య మరణం తో ఈ సినిమా 17 రోజులు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాజల్ హీరో హీరోయిన్ లు గా మెరుపు సినిమా పూజా కార్యక్రమాల జరుపుకోగా ఆ సినిమా ఆగిపోయింది. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఓ సినిమాను పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయగా ఆ ప్రాజెక్టును ముందుకు కదలలేదు. రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాగా అది ముహూర్తం తర్వాత ఆగిపోయింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన వినాలని ఉంది సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అలాగే చిరంజీవి అబు బాగ్దాద్ గజదొంగ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఆగిపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రవితేజ హీరోగా పవర్ అనే సినిమా అనౌన్స్ మెంట్ అవడం తోనే ఆగిపోయింది. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రాధ అనే చిత్రం తెరకెక్కవలసి ఉండగా దాని ప్లేస్ లో బాబు బంగారం వచ్చింది.  బాలకృష్ణ హర హర మహాదేవ సినిమా ముహూర్తం తర్వాత ఆగిపోయింది. విక్రమ సింహ భూపతి సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో  బాలకృష్ణ చేయగా ఆ సినిమా 80 శాతం పూర్తయిన తర్వాత ఆగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: