కొంతమంది హీరోలు కమర్షియల్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దానికి ప్రధాన కారణం హీరోలు ఈ రకం సినిమాలను మినిమం గ్యారంటీ సినిమాలుగా అనుకోవడమే, మరికొంత మంది హీరోలు డిఫరెంట్, డిఫరెంట్ జోనర్ సినిమాలలో నటించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దానికి ప్రధాన కారణం ఒక నటుడిగా తనలో ఉన్న వైవిధ్యమైన నటుడిని జనాలకు చూపెట్టాలని  హీరోల తపనే, ఈ రకం సినిమాలు సక్సెస్ అయితే హీరోకు మంచి పేరు వస్తుంది, అదే ఫెయిల్యూర్ అయితే ఇలాంటి పాత్రలు అవసరమా అనే మాటలు కూడా కొంతమంది అంటుంటారు. అయితే ఇలాంటి డిఫరెంట్ పాత్రలు చేయడంలో మలయాళ స్టార్ హీరో అయినా మోహన్ లాల్  పేరు కూడా మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే. ఈ హీరో కమర్షియల్ సినిమాల కంటే డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే ప్రస్తుతం కూడా ఈ హీరో అలాంటి ఒక చాలెంజ్ పాత్రకే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


 అయితే మోహన్ లాల్ ఈమధ్య ఒక బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ విన్నారట, ఈ కథ హీరోకు తెగ నచ్చేసిందట. అంతే చేతికి గ్లౌజులు తొడిగి బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టేసారట. ఈ ప్రాక్టీస్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తారు అని సమాచారం. ఈ చిత్రంలో మోహన్ లాల్ బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. 60 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడా ఇలాంటి చాలెంజింగ్ క్యారెక్టర్ లో మోహన్ లాల్ కనిపిస్తారు అని వార్తలు రావడంతో హీరో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా బృందం నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే. కొన్ని రోజుల క్రితమే మోహన్ లాల్ హీరోగా నటించిన 'దృశ్యం టు' సినిమా ఒక ప్రముఖ 'ఓటీటీ' లో విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: