వేణు తొట్టెంపూడి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కామెడీ హీరోగా గుర్తింపు పొందిన నటుడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి , తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వేణు 1976 సంవత్సరం జూన్ 4వ తేదీన జన్మించాడు. వీరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా. ధార్వాడ్ అనే ఇంజనీరింగ్ కళాశాలలో తన ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి , ఆ తర్వాత నటనను వృత్తిగా ఎంచుకున్నాడు.అలా మొదటి సారి ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన, ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఆ చిత్రం బడ్జెట్ లోపం తో నిలిచిపోయింది. వేణు ని హీరోగా ప్రోత్సహించి, ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, అతని స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్ పి ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లయ తో కలసి, 1999వ సంవత్సరంలో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వయంవరం అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్న వేణు , ఈ సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది.

ఇక అలా తన సినీ జీవితాన్ని కొనసాగించాడు. 2012 వ  సంవత్సరంలో దమ్ము సినిమాలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన చివరిసారిగా 2013 లో రామాచారి అనే సినిమాలో నటించి,  సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇప్పుడు మరోసారి సరికొత్తగా "రామారావు ఆన్ డ్యూటీ" అనే మూవీ తో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ద్వారా వేణు మరోసారి  తన టాలెంట్ ఏమిటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వేణు తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగా సక్సెస్ అవ్వాలని  మనస్పూర్తిగా కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: