ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అలరించిన చిత్రం హరిపొటర్. చెప్పుకోవడానికి ఈ సినిమా హాలీవుడ్ దే అయినా కూడా భాష, ప్రాంతాలకతీతంగా అన్ని దేశాల ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఈ మూవీలో ఎన్ని సిరీస్ లు రిలీజ్ అయినా... కానీ అదే రీతిలో ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ఈ సిరీస్ లో వచ్చిన ఎనిమిది సిరీస్ లు కూడా హిట్ గా నిలిచాయి. ఈ మూవీలో భారతీయ మూలాలున్న నటి ఉండడం మన భారతీయులకు ఎంతో గర్వకారణం.


ఇందులో నటించిన పద్మా పాటిల్ అనే ముద్దు గుమ్మ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి అయినట్లు ప్రకటించి అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ఆమె ఎమోషనల్ అవుతూ.... ఒక పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తల్లి కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని త్వరలోనే తిరిగి వస్తానని పోస్ట్ చేసింది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ సంబరంలో మునిగి తేలుతున్నారు. తమ అభిమాన నటి తల్లి కావడం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. తన బిడ్డను చూసుకుంటూ మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపమని కోరుతున్నారు. కాగా  ఈ అమ్మడు చదువుకుంటున్న వయసులోనే హరీ పొటర్ మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇలా ఆ మూవీలో నటించిన ఈ చిన్నది కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అనంతరం 2018లో నబిల్ ఖాజీ అని వ్యక్తిని వివాహం చేసుకుని... జీవితంలో సెటిల్ అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తల్లి కావడంతో ఆనందంలో మునిగి తేలుతుంది. ఈ వార్తను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో ఆమె అభిమానులు మాత్రమే కాకుండా సినీ అభిమానులు పలువురు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: