ప్రతి హీరోను తన సినిమాలో అధ్బుతంగా చూపించాలి అనుకుంటాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి.ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటిచింన మంచి గుర్తింపు వస్తుంది అని చాలా మంది నటీనటుల అభిప్రాయం.అయితే రాజమౌళి తో ఇప్పటివరకు పని చేసిన హీరోలకు ఒక బ్యాడ్ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ వెంటాడుతోంది.అదేంటంటే ఈయన డైరెక్షన్ లో సినిమాలు చేసిన హీరోల తరువాత సినిమాలు ప్లాప్ అయ్యాయి.ఇలా రాజమౌళి దర్శకత్వంలో హిట్ కొట్టిన హీరోలతో చాలామంది ఇతర దర్శకులు సినిమాలు తీసి ఫెయిల్యూర్స్ ని చూసారు.

ఇక ప్రస్తుతం తారక్,చరణ్ లు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు హిట్ కొట్టే బాధ్యత డైరెక్టర్ కొరటాల శివపై పడిందట.ఇక సినిమాకి కొన్ని నెలల ముందే రిలీజ్ కావాల్సిన సినిమా ఆచార్య.అయితే కరోనా సెకండ్ వేవ్ వలన ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ తరువాత రిలీజ్ కానుంది.ఈ సినిమాతో కొరటాల శివ.. చరణ్ తో హిట్ కొట్టి రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు.అంతేకాదు  ఆర్ ఆర్ ఆర్ తరువాత తారక్ తో సినిమా చేస్తున్నాడు కొరటాల.

పాన్ ఇండియా మూవీగా యూనివర్సల్ కాన్సెప్టతో ఈ సినిమా తెరకెక్కుతున్న ఇంకా ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మాత్రం ఆగస్టు సెకెండ్ వీక్ లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.ఇక దీని తరువాత కొరటాల శివ,ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.ఈ సినిమా షూటింగ్ తక్కువ సమయంలో పూర్తి అవుతుంది అని నెక్స్ట్ సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని సమాచారం.కొరటాల పై తారక్ తో కూడా హిట్ తెప్పిచాల్సిన బాధ్యత ఉంది.మరి  అన్ని జాగ్రత్తలు తీసుకుని చరణ్ తో, తారక్ తో కొరటాల హిట్స్ సాధిస్తారో లేదో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: