విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళంలో భారీ  విజయం సాధించిన 'అసురన్' సినిమాను తెలుగులో 'నారప్ప' గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల అనగ జూలై 20న ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ వినిపించిన మంచి వ్యూస్ తో పాటు మంచి రేటింగ్ కూడా నమోదు చేసిందని టాక్ వినిపిస్తుంది. ఓటిటిలో కూడా వెంకటేష్ విజయం సాధించాడని చెప్పొచ్చు.

ఇక వెంకటేష్ నటించిన మరో సినిమా  'దృశ్యం 2' కూడా ఓటిటిలోనే రిలీజ్ కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో భారీ విజయం సాధించిన 'దృశ్యం2′ సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కింది.గత కొంతకాలంగా చిన్న సినిమాల నుంచి వెంకీ నారప్ప సినిమా వరకు వచ్చిన సినిమాలు ఎక్కువగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వెంకటేష్ లాంటి టాప్ సీనియర్ హీరో కూడా ఓటీటీకి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ షాక్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ అలాగే అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో నిరాశను వ్యక్తం చేశారు. అయితే చివరికి నిర్మాత నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పలేదు.

వ్యాపారం పరంగా ఆలోచిస్తే అదే చేయడం మంచిది అని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడంపై వెంకటేష్ కూడా చాలా నిరాశకు గురి అయ్యాడు. ఇక తరువాత సినిమాను మాత్రం ఎలాగైనా థియేటర్ లోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నాడట. మలయాళం మూవీ దృశ్యం 2 సినిమా OTT లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం  అందరికి తెలిసిందే.సింగిల్ షెడ్యూల్ లోనే ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారట .

ఇదివరకే దృశ్యం మొదటి భాగం తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. తప్పకుండా దృశ్యం 2కు కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు వచ్చి చేస్తారని నిర్మాత సురేష్ బాబు బాగా నమ్ముతున్నారట. ఈ సినిమాకు కూడా నారప్ప తరహాలోనే ఓటీటీ ఆఫర్స్ చాలానే వచ్చాయట. కానీ మూవీను ఎలాగైనా వినాయకచవితికి థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న f3 సినిమా 2022 సంక్రాతికి విడుదల  చేయబోతున్నట్లు సమాచారం. మరి  ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందో వాయిదా పడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: