బ్యాచిలర్ సినిమా రిలీజ్ కు సిద్ధమైన అక్కినేని యువ హీరో అఖిల్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ గా వస్తున్నాడన్న విషయం తెలిసిందే. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టారు. ఇక త్వరలోనే ఈ మూవీకి సంబందించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. కృష్ణపట్నం పోర్ట్ లో ఈ యాక్షన్ పార్ట్ షూటింగ్ జరపనున్నారట. సినిమా కథకు తగినట్టుగా కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఈ ఫైట్ సీన్స్ ప్లాన్ చేసారట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు 3, 4 తారీఖుల్లో ఈ యాక్షన్ సీన్స్ షూట్ జరుగుతుందని అంటున్నారు. సురేందర్ రెడ్డి మార్క్ యాక్షన్ మూవీగా అఖిల్ ఏజెంట్ ను తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్లు యూత్ ఫుల్ హీరోగా చేస్తూ వచ్చిన అఖిల్ ఈ సినిమాతో పూర్తిస్థాయి మాస్ హీరోగా మారాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే సినిమాలో తన లుక్, స్టైల్ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అఖిల్. ఆల్రెడీ ఏజెంట్ నుండి రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి.

ఇప్పటివరకు తనకున్న క్లాస్ ఇమేజ్ ను మార్చేందుకు అఖిల్ ఏజెంట్ కోసం చాలా బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. సిక్స్ ప్యాక్ బాడీతో అక్కినేని ఫ్యాన్స్ అంచనాలను ఈసారి ఏమాత్రం తగ్గించకుండా ఏజెంట్ మూవీతో అలరించడానికి వస్తున్నాడు అక్కినేని అఖిల్. అయితే బ్యాచిలర్ మూవీ రొమాంటిక్ హిట్ అందుకుంటే ఏజెంట్ తో మాస్ హిట్ కొట్టి స్టార్ గా ఎదగాలని ఫిక్స్ అయ్యాడు అఖిల్. మరి అక్కినేని హీరో ప్లాన్స్ ఏమేరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. ఏజెంట్ మూవీ తర్వాత అఖిల్ తన నెక్స్ట్ కూడా బిగ్ డైరక్టర్ తో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన క్రేజీ అప్డేట్ త్వరలోనే రాబోతుందని ఫిల్మ్ నగర్ టాక్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: