దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే ఎంత విజువల్ వండర్ గా తెరకెక్కిస్తాడో అందరికి తెలిసిన విషయమే.రాజమౌళి సినిమా అన్ని దర్శకుల సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది.సినిమాను ఎంత భిన్నంగా తీస్తాడో అంతే భారీగా విడుదల ఉండేలా చూసుకుంటాడు. పబ్లిసిటీ విషయంలోనూ అలానే ఆలోచిస్తాడు. ఇప్పటివరకు తన సినిమాల విషయంలో ఇలా వైవిధ్యమైన పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చాడు. ఆశించిన ఫలితాల కంటే ఎక్కువ విజయాలు సాధించాడు. తాజాగా మరోసారి తన ట్రేడ్‌ మార్క్‌  పబ్లిసిటీపై దృష్టిపెట్టాడు రాజమౌళి . 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా విడుదలకు సమయం చాలా తక్కువ సమయం ఉండటంతో పబ్లిసిటీ జోరు పెంచాడు. రాజమౌళి సినిమాల పబ్లిసిటీ గురించి చెప్పాలంటే 'బాహుబలి' సినిమా రోజులు గుర్తు చేసుకోవాలి.

ఆ సినిమాకు అంత హైప్‌ వచ్చిందంటే దానికి కారణం రాజమౌళినే. రెండవ భాగం కోసం జనాలు అంతగా ఎదురు చూసారంటే రాజమౌళి చేసిన భారీ పబ్లిసిటీ వలన ఇదంతా జరిగింది. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి కూడా అదే పబ్లిసిటీ ఫార్ములను అప్లై చేయబోతున్నట్లు సమాచారం అందింది. rrr సినిమా మేకింగ్‌ వీడియో విడుదల చేసి ఇప్పటికే సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు.  స్నేహితుల దినోత్సవం నాడు  స్పెషల్‌  ప్రమోషనల్ సాంగ్‌ విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ లోపు రాజమౌళి టీమ్‌ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసి పబ్లిసిటీ స్టార్ట్‌ చేస్తారట.

పాన్‌ ఇండియా మూవీ  కాబట్టి దేశంలో వివిధ నగరాలలో బాగా పబ్లిసిటీ చేస్తారట. ప్రెస్‌ మీట్లు,లైవ్ షో లు,ఇంటర్వ్యూలు అనేకాకుండా చిన్న చిన్న ఈవెంట్లు, ప్రమోషనల్‌ ఫంక్షన్స్ చేస్తారట. దీని కోసం జక్కన్న భారీ పథకాలు రచిస్తున్నారట. ఇప్పుడు ఒక్కో భాష కోసం ఒక్కో విధంగా పబ్లిసిటీ ఉండబోతుందట. సినిమా రిలీజ్ అయ్యే లోపు రాజమౌళి ఇంకెన్ని మ్యాజిక్ లు చేస్తాడో చూడాలి మరి. 

రాజమౌళి తన పబ్లిసిటీ తో సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకొని వెళతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: