కోలీవుడ్ లో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. బస్సు కండక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన రజినీకాంత్ ఇప్పుడు దేశంలోనే సూపర్ స్టార్ గా ఎదగడం అసామాన్యం. సినిమాల్లో సైడ్ పాత్రలు చేసుకుంటూ నిలదొక్కుకుని మంచి గుర్తింపు దక్కించుకున్న రజినీకాంత్ మొదట్లో విలన్ గా ఎన్నో పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.

బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ అనే సినిమాతో  తెరపై అడుగుపెట్టాడు రజినీ. బాలచందర్ సినిమాలతో రజనీకి ఎంతో పేరు వచ్చింది అనే విషయం అందరికీ తెలిసిందే.ఆయనకు సంతృప్తి కలిగేలా నటించాలంటే కత్తి మీద సాము.  చాలా సాధన తో పాటు ఎంతో కృషి చేయాలి. నటనలో ఏమాత్రం చిన్న లోటు కనిపించిన కూడా ఆయనకు తెగ కోపం వస్తుంది. ఒకవేళ బాగా నటిస్తే మాత్రం అందరి ముందు శభాష్ అని పొగుడుతారు. అతిలోక సుందరి శ్రీదేవి తమిళంలో తొలిసారి కథానాయికగా ఆయన దర్శకత్వంలోనే నటించగా అప్పుడు ఆమె వయస్సు 13 సంవత్సరాలు కావడం విశేషం. 

బాలచందర్ ఎంత గొప్ప దర్శకుడో అంతే కోపం కలవారు. రజనీకాంత్ ఓ సన్నివేశంలో భాగంగా సరిగ్గా నటించలేదని ఆయనను కొట్టేశారట. శ్రీదేవి కూడా ఆ సినిమా లో నటించడంతో ఆమె ఓ సన్నివేశానికి 13 టేకులు తీసుకోగా 14వ టేక్ నీ డైరెక్టర్ ఓకే చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు శ్రీదేవి ఓ సీన్ కి అన్ని టేకులు కూడా తీసుకున్న సందర్భం రాలేదు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో శ్రీదేవి స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాలో రజనీకాంత్ శ్రీదేవి అప్పట్లో ఎక్కువ పారితోషికం ఇవ్వడం విశేషం. తెలుగులో కె విశ్వనాథ్ రూపొందించిన ఓ సీతకథ చిత్రం తమిళంలో రీమేక్ చేయగా ఆ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: