సినీ హీరోయిన్లు చాలామంది వివాహ జీవితానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో ఇప్పటికీ ఒక క్లారిటీ కూడా లేదు. కాకపోతే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక వారి జీవితానికి పెళ్లి అనే రంగులు దిద్ది జీవితాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.ఇక పోతే మన హీరయిన్లు అన్నీ ఉన్నా, పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఇందుకు గల కారణం వారికి సినిమాలపై నటన అని చెప్పవచ్చు. ఇకపోతే పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన కొంతమంది హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

1. శోభన:
ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు 51 సంవత్సరాలు. ఈమె హీరోయిన్ మాత్రమే కాదు నృత్య కళాకారిణి కూడా.. అయితే ఈమె ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగితే, పెళ్లి మాత్రమే జీవితంలో సంతోషాలను ఇవ్వదు. సంతోషాన్నిచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి నాకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు అని చెప్పింది.

2. దివ్య దత్త:
ఈమె వయసు 43 సంవత్సరాలు.. ఇక హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. పెళ్లికి మాత్రం నో అని చెబుతోంది.. ఎందుకంటే ఆమె అభిప్రాయాలకు, అభిరుచులకు తగ్గట్టుగా ఏ వ్యక్తి తనకు కనబడలేదు అని, అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది.

3. అమీషా పటేల్:
ఇక ఈమె వయసు 46 సంవత్సరాలు. అటు తెలుగు, ఇటు హిందీ సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమీషా పటేల్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

4. నగ్మా;
ప్రస్తుతం ఈమె వయస్సు 46 సంవత్సరాలు. తెలుగు, హిందీ, పంజాబీ, మరాఠీ, కన్నడ ఇలా అన్ని భాషలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి కంటే ఒంటరి జీవితమే బెటర్ అని అంటుంది నగ్మా.

5. సుస్మితాసేన్:
ఈమె వయసు 50 సంవత్సరాలు. అయితే ఈమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని, వారి ఆలనా పాలనా చూసుకుంటుంది . పెళ్లి అంటే మాత్రం వద్దు అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

6. టబు :
టబు వయసు కూడా 50 సంవత్సరాలు. ఇక ఈమె చెప్పుకు వచ్చే విషయం ఏమిటంటే, మన ఆలోచనలను గౌరవించని వ్యక్తి మన జీవితం లోకి వస్తే , అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు అని ,అందుకే పెళ్లి చేసుకోకుండా ధైర్యంగా జీవిస్తున్నానని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: