ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోలు ఎక్కువగా గాయాలపాలు అవుతున్నారు. ఇక అలాంటి వారిలో తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరో కార్తీక్ కూడా ఇటీవల గాయాలపాలయ్యాడట. ఇక ఈయన తెలుగులో కూడా నటించాడట ఆయన గురించి తెలుసుకుందాం.

ఈయన తెలుగులో "సీతాకోకచిలుక"సినిమాలో నటించాడు. ఈయన ఉదయం వ్యాయామం చేస్తూ ఉండగా కింద పడ్డాడట. అలా పడడంతో ఈయనకు మెడ దగ్గర చాలా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈయన గాయాల నుంచి బయట పడే దానికోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదట. ఇక అంతే కాకుండా ఈయన గత కొద్దిరోజుల నుంచి బిపి, శ్వాసకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారట. ఈయన తమిళ్ , తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించాడు. ఇక ఈయన నటించిన సినిమాలలో సీతాకోకచిలుక అప్పట్లోనే ఎంతో హిట్ గా నిలిచింది. దీంతో ఆయనకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు.

ఇక ఈయన  నటించిన సినిమాలలో.. అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి. వంటి పలు చిత్రాల్లో నటించి మంచి హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఈయన ఇటు సినిమాల వైపు, అటు రాజకీయంగా కూడా రాణిస్తూ ఉండేవాడు. ఇక ఈయన సొంతంగా ఒక పార్టీని కూడా స్థాపించాడట. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. తన ఆరోగ్య పరిస్థితులు బాగో లేనందు వలన ఆ పార్టీని రద్దు చేశారు.

ఈయన కుమారుడు కూడా తెలుగులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "కడలి"సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. కార్తీక్ కుమారుని పేరు గౌతమ్. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే ఇలా ఆయన గాయాలపాలవ్వడంతో , ఆయన అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. ఏది ఏమైనా తొందరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: