దక్షిణాదిన అగ్ర దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వినయవిధేయ రామ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దాంతో రెండేళ్లుగా మెగా అభిమానులు ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూసేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది  అక్టోబర్ లో ఈ సినిమా విడుదల చేసేందుకు దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు కూడా.

అలాగే తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్. కొరటాల శివ తో డైరెక్ట్ సినిమా చేయకపోయినా ఇలా ఇండైరెక్ట్ గా కొరటాల శివ దర్శకత్వంలో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా తీసుకున్నారు. చూడబోతే ఈ సినిమాలో దాదాపు అర గంట కంటే ఎక్కువగానే కనిపిస్తాడని తెలుస్తోంది. సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ సినిమా తర్వాత శంకర్  సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుంది అని తెలుస్తుంది. కరోనా నుంచి అన్ని దేశాలు ఇపుడిపుడే బయటపడుతున్న నేపథ్యంలో విదేశాల్లో జరగాల్సిన షూట్ నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది శంకర్ ఆలోచన. అందుకే ఇప్పుడు ముందుగా పాటలను కంపోజ్ చేస్తున్నాడు. ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కియరా అద్వానీని హీరోయిన్ గా అనుకుంటుండగా రష్మిక మందన హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ ఇంకో వర్గం వాదిస్తోందట. ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: