సినిమా పరిశ్రమ అంటే బయట ఎంత మంచి పేరు ఉన్న ఏదో ఒక మూలన మాత్రం చులకనభావం తప్పకుండా ఉంటుంది. సినిమా వాళ్ళన్న సినిమాలు చేసే వాళ్ళన్న ఆఖరికి సినిమా చూసే వాళ్ళన్న అందరికీ చులకనే. కానీ ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే సినిమా చూడాల్సిందే. రేసుగుర్రం లో ఇలాంటి భావన ఉంటే సినిమా పరిశ్రమ ఓ ఆదాయంగా మాత్రమే చూసే నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటి ప్రభుత్వాలలో ఉన్న నాయకులు సినిమా పరిశ్రమను జాతీయంగా అంతర్జాతీయంగా ఎప్పుడు ఎదగనీయరు.

దానికి తోడు ఏ రంగానికి లేని ఆంక్షలు ఈ రంగానికి పెట్టని కండిషన్ లు పెడుతూ సినిమా పరిశ్రమను కోలుకొనివ్వకుండా చేస్తూ ఉంటారు. అసలే ప్రభుత్వాల వ్యవహారంతోనే సినిమా పరిశ్రమ నలిగిపోతుంటే ఇంకోవైపు కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను సినిమా పరిశ్రమలోని నిర్మాతలను అందరిని ఇబ్బందులు పెడుతుంది. గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ కి వాటిల్లే నష్టం వేల కోట్లలో ఉంది అంటే నమ్మాల్సిందే. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమకు ఏర్పడిన సంక్షోభం లో కూడా రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమకు ఆంక్షలు పెట్టి సినిమా పరిశ్రమను చంపేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ రేట్ల విషయం ఇంకా తీరనే లేదు. దాని వల అక్కడ సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. తద్వారా వేల కోట్లు నష్టం వాటిల్లుతుంది పరిశ్రమకు. ఇటీవలే నేచురల్ స్టార్ నాని దీనిపై మండిపడ్డాడు. తిమ్మరుసు సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడగా కరోనా వచ్చినప్పుడు అన్నిటికంటే ముందు మూసేది థియేటర్లు. అన్నిటికంటే చివర్లో తెరిచేది కూడా థియేటర్లు. బార్లు రెస్టారెంట్లకు లేని ఆంక్షలు సినిమా థియేటర్లకు ఎందుకు? వాటితో పోలిస్తే థియేటర్లు చాలా సేఫ్.  ఎంతైనా సినిమా అంటే చిన్నచూపు అందరికీ అన్నారు. దాంతో టాలీవుడ్ లోని కొంత మంది ప్రేక్షకులు నాని లా ఇతర హీరోలు ఎందుకు ధైర్యం చేసి మాట్లాడలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: