చాలా పరిణామాల అనంతరం థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా మూతబడ్డ థియేటర్లు రీ ఓపెన్ కావడానికి చాలా సమయం పట్టింది. టికెట్ రేట్లు, పార్కింగ్ ఫీజు, 50 శాతం ఆక్యుపెన్సీ వంటి ప్రభుత్వ నిబంధనల వల్ల నష్టాలు తప్పట్లేదు అంటూ థియేటర్ల యాజమాన్యం చాలా రోజులు కినుక వహించారు. అందుకే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ చేయవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సినిమా హాళ్లు తెరుచుకోలేదు. దీంతో టాప్ ప్రొడ్యూసర్స్ సైతం తమ సినిమాలను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో థియేటర్ యాజమాన్యం, ఎగ్జిబిటర్లు ఓటిటి వద్దు థియేటర్లో ముద్దు అంటూ ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజాలలో సినిమాలు విడుదల చేయొద్దు అంటూ మొరపెట్టుకున్నారు. పరిస్థితులు గందరగోళంగా మారడంతో గత పది రోజుల క్రితం థియేటర్ల నా యజమానులు, ఎగ్జిబిటర్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ బాధలను వెళ్లగక్కారు. మొత్తానికి ప్రభుత్వం స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఎట్టకేలకు సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కోర్టు డ్రామా "తిమ్మరసు", తేజ సజ్జ "ఇష్క్" జూలై 30న థియేటర్లలోకి రానున్నాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం "ఎస్ఆర్ కళ్యాణమండపం"తో ఆగస్ట్ 6న ప్రేక్షకులను అలరించనున్నాడు. హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ "ఎఫ్9" ఆగస్టు 5న రానుంది. అజయ్ భూపతి దర్శకత్వలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ "మహాసముద్రం" ఆగస్టు 19 సినిమా హాళ్లలో హల్చల్ చేస్తుంది. ఆగస్టు 13న నేచురల్ స్టార్ నాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ "టక్ జగదీష్", అక్కినేని అఖిల్, పూజాహెగ్డే రొమాంటిక్ ఎంటర్టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్", ఆగస్టు 20న యంగ్ హీరో అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ల "డియర్ మేఘ" విడుదలకు సిద్ధంగా ఉండటంతో థియేటర్లు రానున్న రోజుల్లో గతంలో లాగే కళకళలాడబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: