సౌత్ స్టార్ హీరోయిన్ గా కాజల్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. టాలీవుడ్ చందమామ కాజల్ కు తెలుగులో స్టార్ క్రేజ్ రావడంతో తమిళంలో కూడా అదే ఫాం కొనసాగించింది. టలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ స్టార్ హీరోలందరితో నటించిన కాజల్ ఇప్పుడు పెళ్లి తర్వాత తన రూట్ మార్చాలని ఫిక్స్ అయ్యింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఆలోచనలను మార్చేసుకుంది కాజల్. అంతకుముందు హారర్ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించని కాజల్.. ఆ సినిమా ఛాన్సులు వచ్చినా అవంటే నాకిష్టం ఉండవు అన్నట్టుగా అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చింది.

కాని పరిస్థితులు మారాయి ఇప్పుడు ఏ సినిమా వచ్చినా చేయాల్సిందే. మ్యారేజ్ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ రావడమే లక్ అని చెప్పొచ్చు. అలాంటిది ఆప్షన్స్ అంటే అసలు ఎక్స్ పెక్ట్ చేయలేం. ఈ క్రమంలో కాజల్ కూడా తన మనసు మార్చుకుందని తెలుస్తుంది. హారర్ సినిమాల మీద తన ఆలోచన విధానం మార్చుకుందని టాక్. అందుకే లేటెస్ట్ గా కాజల్ కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ సబ్జెక్ట్ కు ఓకే చెప్పిందని అంటున్నారు. విహారి అనే నూతన దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన కాజల్.. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీస్ లో నటిస్తున్న కాజల్ హారర్ సినిమాల్లో తన సత్తా చాటాలని చూస్తుంది. అప్పుడు చేయనని చెప్పిన హారర్ జోనర్ సినిమాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావ్ అంటూ అభిమానులు అడుగుతున్నా నటిగా అన్ని పాత్రలు చేయాల్సిందే అని సూపర్ కవరింగ్ చేసుకుంటుంది కాజల్. గౌతం కిచ్లుతో మ్యారేజ్ తర్వాత కూడా సెలెక్టెడ్ సినిమాలు చేసేందుకు రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను అలరించడానికి ఎలాంటి సినిమాలకైనా సిద్ధం అంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: