ఎన్టీఆర్.. టాలీవుడ్ లో టాప్ హీరోల్లలో ఒక్కరు. తెలుగు చలన చిత్రం అనే ఓ మహా పుస్తకంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు నందమూరి తారక రామారావు. ఆయన మనవడిగా.. మూడో తరంలో నట వారసత్వం అందుకుని.. తన నటనతో మనల్ని మెప్పిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన ఎన్టీఆర్..త్వరలోనే మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి rrr మూవీతో  రెడీగా ఉన్నాడు.
అయితే, ఎన్టీఆర్ కు సెంటిమెంట్స్ ఎక్కువ అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఏ పని చెయ్యాలని అనుకున్నా ఒక్కటికి .. నాలుగు సార్లు ఆలోచించుకుని చేస్తారు. అలాంటిది ఆయన ఒక్క సినిమా వదులుకున్నారంటే .. అందులో ఎంతో కొంత ఆయనకు మైనస్ అనిపించిందనే అర్ధం. తన కెరీర్ లో తారక్ ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసాడు. తారక్ రిజెక్ట్ చేసిన సినిమాలు మరో హీరో దగ్గరకు వెళ్లి .. బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కానీ, తారక్ ఆ సినిమాలు వదులుకున్నందుకు ఏ మాత్రం భాదపడలేదు.. కొత్త కధలతో.. తన బాడీ లాగ్వేంజ్ కు తగ్గ స్టోరీస్ తో ముందుకు వెళ్ళాడు. కానీ , తారక్ కెరీర్ లోనే ఓ సినిమా కధ విని..ఆయనకు తీవ్రంగా తలనొప్పి వచ్చిందట. ఆ సినిమా స్టోరీ ఏంటో తెలుసా..?? .. అదే టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గేస్ట్ డిజాస్టర్ మూవీ.. ‘బ్రహ్మోత్సవం’.
‘బ్రహ్మోత్సవం’ సినిమా ఎంతటి డిజాస్టర్ టాక్ ను సోంతం చేసుకుందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి హీరోగా మొదట అనుకున్నింది మహేష్ బాబును కాదట.  ‘బ్రహ్మోత్సవం’ ను యొంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్నారట.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ ఈ స్టోరిని ఎన్టీఆర్ కు వినిపించాడట. కానీ, ఈ కధ తారక్ కు నచ్చకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దీంతో ఈ కధ మహేష్ దగ్గరకు చేరింది. ఆయన కెరీర్ లోనే బిగ్గేస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: