ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గురించి తెలియని వారంటూ ఉదన్నారు. ఇక శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్నా సినిమా అఖండ. ఇక ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడో సినిమా అని ఆదరికి తెలిసిందే. అయితే ఈ మూవీలో బాలకృష్ణకు విలన్ గా శ్రీకాంత్ నటిస్తుండగా జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే అఖండ సినిమాలో బాలకృష్ణ కొంత సమయం అఘోరా పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ అయింది. ఇక బాలయ్య ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాలో జగపతిబాబు కూడా అఘోరా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. బాలయ్యకు మార్గదర్శకుడిగా జగపతి బాబు కనిపిస్తారని సమాచారం తెలుస్తుంది.

ఇక బాలయ్య మరో పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నారు. కాగా.. బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. అయితే బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నా ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉండవని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తమిళనాడులో అఖండ క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేని బాలకృష్ణ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు అనుకుంటున్నారు.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడగా త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ త్వరలో రానున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా వాయిదా పడగా త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన రానున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: