టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు బోలెడన్నీ చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు దర్శకుడు, హీరో, రచయిత అంటూ ఇలా చాలా మంది ఉండే వారు. ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ, చాలా వరకు మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమా తీయాలంటే దర్శకుడు, కథ ఇచ్చే రచయిత, హీరో కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్‌లో యంగ్ హీరోలు మూడింటినీ ఒకరే చేస్తున్నారు. వినూత్నమైన ఈ తరం కథలను రాసుకుంటూ వాటిని వెండితెరమీదకు తీసుకొచ్చి సక్సెస్ అవుతన్నారు. అయితే, కొందరు దర్శకత్వ బాధ్యతను వేరే వారికి అప్పజెప్పి స్టోరీ, స్క్రీన్ ప్లే మట్టుకు ఇస్తున్నారు. మరికొందరు స్క్రీన్ ప్లే మాత్రమే ఇస్తున్నారు.

యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’ సినిమాకు స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా దర్శకుడిగా వ్యవహరించాడు. ‘అశ్వథ్థామ’ చిత్రానికి నాగశౌర్య రైటర్, ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ‘జాతి రత్నాలు’ సినిమాతో జనాలందరినీ కడుపుబ్బ నవ్వించిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’కు స్టోరీ , స్క్రీన్ ప్లే ఇచ్చాడు. సిద్ధు జొన్నలగడ్డ కూడా తాను నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించిన ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

అయితే, యంగ్ హీరోలు మాత్రమే కాకుండా గతంలో కూడా కొందరు టాలీవుడ్ హీరోలు తమ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే ఇచ్చారు. డైరెక్షన్ విషయానికొచ్చే సరికి భయపడిపోయారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ‘జానీ’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేతో పాటు డైరెక్షన్ కూడా చేశారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ అభిమానులు, సినీ లవర్స్, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: