టాలీవుడ్ లో కమర్షియల్ మూవీస్ తీసి హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకువచ్చిన డైరెక్టర్లు అప్పట్లో కొందరే ఉండేవారు. వారిలో ముందు కె రాఘవేంద్రరావుని చెప్పుకోవాలి. ఆయన తరువాత అంతే స్థాయిలో సూపర్ హిట్లు ఇచ్చిన ఎ కొదండరామిరెడ్డిని కూడా గుర్తుంచుకోవాలి. కోదండరామిరెడ్డి వరస హిట్లతో ఒక దశలో నంబర్ వన్ రేసులోకి వచ్చేశారు.

ఇదిలా ఉంటే మనుషులు మారాలి మూవీ ద్వారా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన  కోదండరామిరెడ్డికి దర్శక గురువు వి మధుసూదనరావు. ఆయన దగ్గర చాలా సినిమాలకు పనిచేసిన కోదండరామిరెడ్డి తరువాత రోజులలో కె రాఘవేంద్రరావు వద్ద కూడా కో డైరెక్టర్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే వి మధుసూదనరావు దగ్గర  ఆయన పనిచేస్తున్న సమయంలోనే ఆయన్ని టాలెంట్ చూసిన హీరోలు దర్శకుడిగా  పైకి వస్తాడు అనుకునేవారుట.

శోభన్ బాబు హీరోగా వి మధుసూదనరావు డైరెక్షన్ లో  తీసిన మల్లెపూవు సినిమాకు కోదండరామిరెడ్డి అసిస్టెంట్ గా పనిచేశారు. ఈ మూవీ లోని కొన్ని సాంగ్స్ కి కాశ్మీర్ లో చిత్రీకరించాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో మధుసూదనరావు తాను షూటింగ్ కి రాలేను అని చెబితే ఆయనకు బదులుగా కోదండరామిరెడ్డి వెళ్లారుట. కాశ్మీర్ లో చకచకా సాంగ్స్ షూట్ చేస్తూ చాలా చలాకీగా కోదండరామిరెడ్డి హీరో శోభన్ బాబుని ఎంతో ఆకట్టుకున్నారుట. దాంతో శోభన్ బాబు ఈయన ఎప్పటీకైనా టాప్ డైరెక్టర్ అవుతాడు అని చిత్ర యూనిట్ తో అనేవారుట.

శోభన్ బాబు జోస్యం కచ్చితంగా ఫలించింది. ఆ తరువాత రెండేళ్ళకే కోదండరామిరెడ్డి డైరెక్టర్ అయ్యారు. అంతే కాదు, ఆయన శోభన్ బాబుతో కూడా శ్రావణ సంధ్య, బావామరదళ్ళు వంటి సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ఇక్కడ మరో ముచ్చట కూడా చెప్పుకోవాలి. కోదండరామిరెడ్డి సినిమా రంగానికి వచ్చింది డైరెక్టర్ అవుదామని కాదు, హీరో కావాలనే. కానీ ఆయన ఆశలు ఫలించక అలా దర్శకత్వ శాఖలో చేరి టాలీవుడ్ గరించే టాప్ డైరెక్టర్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: