కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇప్పుడిపుడే అన్నీ మెల్ల మెల్లగా కోలుకుంటున్నాయి. ఈ దశలోనే కరోనా మొదటి వేవ్ సమయంలో షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలన్నీ షూటింగులను పూర్తి చేశారు. అయినా కానీ మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందనే భయంతో ఇంకా పెద్ద పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలను ప్రకటించకుండా వెనుకడుగు వేస్తున్నాయి. అయితే ఇంతటి పరిస్థితుల్లో కూడా దైర్యంగా సినిమా విడుదల తేదీని ప్రకటించి టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొద్ది రోజుల క్రిందటే తిమ్మరుసు చిత్ర బృందం జూలై 30 వతేదీన థియేటర్లో విడుదల చేస్తామని ప్రకటించింది. వీరు సినిమా కంటెంట్ పై ఎంత నమ్మకంగా లేకపోతే మహామహులు సైతం వెనుకంజ వేస్తున్న దశలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

ఆ రోజు రానే వచ్చింది వాస్తవంగా రేపే సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా థియేటర్లపై సందిగ్ధంలో ఉన్నారు. కానీ థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతులిచ్చినా థియేటర్ యాజమాన్యాలు మరియు డిస్ట్రిబ్యూటర్ ల మధ్యన చిన్న పాటి విఅవదల కారణంగా అది కాస్తా వాయిదాపడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం థియేటర్లు జూలై 31 వ తేదీ నుండి ఓపెన్ చేస్తారని తెలుస్తోంది. దీనిని బట్టి థియేటర్లు ఓపెన్ కాకుండా విడుదల ఎలా అనే దానిపై తిమ్మరుసు టీమ్ టెన్షన్ లో ఉంది. అయితే రేపు తిమ్మరుసు సినిమా విడుదల ఉంటుందా ? లేదంటే ఎల్లుండి నుండి విడుదల చేస్తారా అన్నది రేపు తెలిసే అవకాశం ఉంది.

ఈ సినిమాలో యువ కథానాయకుడు సత్యదేవ్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక జువాల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ కథ లాయర్ చుట్టూ అల్లుకున్న ఒక థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: