బుల్లితెర‌పై చిచ్చ‌ర పిడుగా దూసుకు వ‌చ్చి తానేంటో నిరూపించుకుంది యాంక‌ర్ అన‌సూయ‌. నిజంగా చెప్పాలంటే ఈ హాట్ యాంక‌ర్ ఏ షో స్టార్ట్ చేసినా కూడా అది విజయవంతమౌతుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి ఆమె ప్ర‌యాణం జబర్దస్త్ షో మొదలైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఓ రేంజ్లో దూసుకెళ్తోంద‌నే చెప్పాలి. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇప్పటి హీరోయిన్ల కంటే కూడా ఆమె ఎంతో బిజీగా ఉంద‌నే చెప్పాల్సి వ‌స్తుందేమో.

ఇంకా చెప్పాలంటే ఆమె బుల్లి తెర గోల్డెన్ లెగ్ గా ఆమె ఏ షో చేసినా అది సూప‌ర్ హిట్ అవుతోంది. ఆమెను చూడ‌టానికే ప్రేక్ష‌కులు ఆ షోలు కూడా చూస్తారంటే ఆమెకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఆమె ఇద్దరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చినా కూడా షోలలో మాత్రం హాట్ గ్లామరస్‌తో ప్రేక్ష‌కుల‌ను క‌వ్విస్తోంద‌నే చెప్పాలి.  ఆమెకు ఈ క్రేజ్ తో పెద్ద పెద్ద మూవీల్లో కూడా ఆఫర్లు వ‌స్తున్నా ఆమె వ‌ద్ద‌ని చెబుతోందంట‌.

కార‌ణం ఏంటంటే ఆమెకు పారితోషికం కంటే చేసే పాత్రే ముఖ్యం అన్నది తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే ఆమెకు ఎన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కూడా కేవ‌లం కొన్ని మాత్ర‌మే ఒప్పుకుంటోంది. ఇక ఆమె స్టోరీల విషయంలో అయితే ఎంతో కరాకండిగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని స‌మాచారం. ఇప్పుడు ఆమె మరో మూవీకి సైన్ చేసేసింద‌ని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా టైటిల్ కూడా పెట్టలేద‌ని తెలుస్తోంది.

అయితే ఇందులో ఆమె ఎయిర్ హోస్టెస్ గా చేస్తుంద‌ని స‌మాచారం. అయితే ఈ మూవీలో 6 కథలు క‌లిసి ఉంటాయ‌ని స‌మాచారం. అయితే ఈ ఆ ఆరు కథల్లోని ప్ర‌తి దాంట్లో కూడా అనసూయ ఎంతో హైలెట్ గా  కనిపిస్తుందని ఇప్ప‌టికే ఊహానాలు వ‌స్తున్నాయి. జయ శంకర్ ఈ మూవీకి డైరెక్ట‌ర్గా చేస్తున్నాడు. మొద‌టి నుంచి జయ శంకర్ అనసూయను డిఫరెంట్ గా చూపించ‌డానికి ట్రై చేస్తున్నాడు. చూడాలి మ‌రి ఈ మూవీ ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: