సినిమా చిన్నదా పెద్దగా అనే దాని కన్నా మూవీ ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ ఎంత గొప్పది అనంది అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చిన్న సినిమాకు పెద్ద వాళ్ల ప్రమోషన్ కంపల్సరీ అయ్యింది. స్టార్స్ చేస్తే ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్.. స్టార్ డైరక్టర్స్ ఫ్యాన్స్ ఆ సినిమా గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా వారు చేస్తున్న చిన్న సినిమాకు మంచి ప్రమోషన్ దొరుకుతుంది. లేటెస్ట్ గా చిత్రపటం అనే చిన్న సినిమాకు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. రైటర్ బండారు దానయ్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలోని నింగిని చూసి నేర్చుకున్న సాంగ్ ను విజయేంద్ర ప్రసా రిలీజ్ చేశారు.

సినీ గేయ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బండారు దానయ్య ఆల్రెడీ డైరక్టర్ గా ఇదివరకు ప్రయత్నాలు చేయగా లేటెస్ట్ గా ఒక మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ తో చిత్రపటం సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో పార్వతీశం, శ్రీవల్లి లీడ్ రోల్స్ గా జతకడుతున్నారు. శ్రీ క్రియేషన్స్ పతాకంలో చిత్రపటం మూవీని పుప్పాల శ్రీధర రావు నిర్మిస్తున్నారు. సినిమాలో తండ్రి కూతురు మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులను కట్టిపడేస్తయని అంటున్నారు. మంచి కథ.. అంతకుమించిన టైటిల్.. మ్యూజిక్.. లిరిక్స్ ఇవన్ని ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని విజయేంద్ర ప్రసాద్ చిత్రయూనిట్ ను ప్రశంసించారు.

ఇంటర్నెట్ లో అన్ని దొరుకుతున్నాయి.. మనిషికి ఏం కావాలో అన్ని ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయి.. కాని ఎమోషన్ మాత్రం దొరకదు. ఈ సినిమాలో అదే పాయింట్ ను చాలా ఎమోషనల్ గా చూపిస్తున్నామని అన్నారు దర్శకుడు బండారు దానయ్య. సినిమాకు కథ, కథనం మాత్రమే కాదు సంగీతం సాహిత్యం కూడా బండారు దానయ్య అందించారని తెలుస్తుంది. రైటర్ గా సక్సెస్ అయిన దానయ్య డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రపటం ప్రేక్షకులను మెప్పించాలని బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: