ఇటివల కాలంలో తెలుగు సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే తెలుగులోని చాలా సినిమాలు హిందీలో రీమేక్ అవ్వడంతో పాటు, డబ్ కూడా అయ్యాయి. తెలుగు సినిమాల్లోని టాప్ కమర్షియల్ ఎలిమెంట్స్ హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ దర్శకనిర్మాతలు వారి నాడిని సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు. కానీ టాలీవుడ్ దర్శకులు వారికి కావాల్సిన ఎంటర్టైనెర్మెంట్ ను అందిస్తున్నారు. అందుకే హిందీలో డబ్ అయ్యే తెలుగు సినిమాలకు అంత డిమాండ్. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. దక్షిణాది సినిమాల డబ్బింగ్ రైట్స్ కోసం అక్కడి నిర్మాతలు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించడానికి వెనుకాడడం లేదు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి చిత్రం "అయ్యప్పనుమ్ కోషియం" రీమేక్. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ కు సంబంధించిన డీల్ పూర్తయ్యింది. 23 కోట్ల భారీ మొత్తానికి, #PSPKRanaMovie నిర్మాతలు ఒప్పందాన్ని ముగించారు. హిందీ రీమేక్ రైట్స్ పరంగా మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' ఇంతవరకూ అత్యధిక ధరకు అమ్ముడైన చిత్రం. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ. 22 కోట్లు పొందినట్లు సమాచారం. ఈ ఫీట్‌ను ఇప్పుడు చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధిగమించారు. అంతకుముందు మహేష్ బాబు "మహర్షి" డబ్బింగ్ హక్కులు 20 కోట్లకు, అల్లు అర్జున్ "అల వైకుంఠపురం"లో 19 కోట్లకు, ఎన్టీఆర్ "అరవింద సమేత" 18 కోట్లకు, "సరిలేరు నీకెవ్వరు" 15.2 కోట్లకు అమ్ముడయ్యాయి. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న రివీల్ చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: