పోర్న్‌ చిత్రాల కేసులో అరెస్ట్‌ అయిన శిల్పశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై బీజేపీ పార్టీ నాయకులు రామ్‌ కదం సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ ఉన్నటు వంటి ఓ స్టార్‌ మొడల్‌ ను లైగింకంగా వేధించడమే కాకుండా... ఆన్‌లైన్‌ గేమ్‌ పేరిట.. ఏకంగా అక్షరాల మూడు వేల కోట్ల రూపాయల స్కామ్‌ కు రాజ్‌ కుంద్రా పాల్పడినట్లు ఆరోపణలు చేశారు బీజేపీ పార్టీ నాయకులు రామ్‌ కదం. ఆన్‌లైన్‌ గేమ్‌ లతో డబ్బులు గుజ్జడమే కాకుండా... వీటి ప్రమోషన్‌ కోసం ఆయన భార్య శిల్పాశెట్టిని కూడా రాజ్ కుంద్రా వాడుకున్నాడని నిప్పులు చెరిగారు రామ్‌ కదం.  

ఇదే సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో ముంబైలోని జుహు పోలీస్‌ స్టేషన్‌ లో రాజ్‌కుంద్రాపై లైంగిక వేధింపులకు గురైన ఆ మోడల్‌... కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయన చెప్పారు. కానీ ఆ కేసులో ఆ మోడల్‌ ను రాజ్‌ కుంద్రా బెదిరించాడని మండిపడ్డారు. గేమ్‌ ఆఫ్‌ డాట్‌ అనే ఆన్‌ లైన్‌ గేమ్‌ ను రాజ్‌ కుంద్రా ప్రారంభించి..మామూలు జనాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. 

శిల్పశెట్టి ఫోటో పెట్టి ఆ ఆన్‌ లైన్‌ గేమ్‌ తో ప్రజలను రాజ్‌ కుంద్రా బురిడి కొట్టించాడని మండిపడ్డారు. సర్కార్‌ గుర్తింపు ఉన్న ఆన్‌ లైన్‌ గేమ్‌ అని చెప్పుకొని... రాజ్‌కుంద్రా కు చెందిన వయాన్‌ ఇండస్ట్రీస్‌ ఏకంగా రూ. 3000 వేల కోట్ల స్కామ్‌ కు పాల్పడిందని ఆరోపించారు రామ్‌ కదం.  దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా.. అటు  ముంబై హైకోర్టులో శిల్పాశెట్టికి షాక్‌ తగిలింది. టీవీ ఛానెళ్లు పేరు, రేటింగ్ కోసం తన పరువును బజారుకీడుస్తున్నాయని ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి తన గురించి కథనాలు ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే, శిల్పాషెట్టి పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది న్యాయస్థానం. మీడియా నుంచి వచ్చే ప్రశంసలే కాదు.. విమర్శలూ, ఆరోపణలనూ స్వీకరించాల్సి ఉంటుందని చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: