ఒక సినిమా థియేటర్లలో విడుదల కావాలంటే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ తప్పనిసరి. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలు చూసి అందులో ఏవైనా  అశ్లీల దృశ్యాలు ఉన్నా అసభ్యకరమైన సంభాషణలు ఉన్నా, దేశాన్ని తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ తొలగించి సినిమాకు ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానినే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ అంటారు. ఈ సర్టిఫికెట్ లేనట్లయితే సినిమా థియేటర్లలో విడుదల చేయడం అనేది జరగదు. ఇలా సినిమా అనేది సినిమా తీసిన మేకర్స్ నుండి జనాలకు చేరే మధ్యలో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదే 'ఓటిటి' డిజిటల్ ప్రచారాలకు మాత్రం ఇలాంటి ఏ పద్ధతి ఉండదు. వీరు నేరుగా వారు తీసిన కంటెంట్ను తమ డిజిటల్ ప్లాట్ ఫాం లో ప్రసారం చేసుకోవచ్చు. ఇలా వారు తీసిన కంటెంట్ ను నేరుగా ప్రసారం చేసుకోవడంపై అనేకమంది కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.


అందులో భాగంగా డిజిటల్ కంటెంట్ కట్టడి చేయడానికి కేంద్ర సమాచార ప్రచార శాఖ, ఐటీ యాక్ట్‌ ను చాలా కఠినతరం చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతం 'ఓటిటి' స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్ కట్టడిలో  కేంద్రం కొరడా జులిపించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు, ఫిలిం మేకర్ అయినా అనురాగ్ కశ్యప్ తీసిన 'ఘోస్ట్‌ స్టోరీస్‌'అనే షార్ట్ ఫిలిం పై కేసు నమోదైంది. ఇది అందాలజీ షార్ట్ ఫిలిం కిందటి ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షార్ట్ ఫిలిం లో ఒక సీన్ లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ మృత శిశువును చేతిలో పట్టుకొని కూర్చుంటుంది. ఆ సన్నివేశం కథకు అవసరం లేదని, అయినా మేకర్స్ ఆ సన్నివేశాన్ని తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అంశమని జూలై 27న నమోదైన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అవుతుందా. ? లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన వీలైనంత త్వరగా అనగా 24 గంటల్లో ఫిర్యాదు నమోదు చేయాలని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: