సినిమా రంగంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయటం కామన్. ఎవరైనా దర్శకుడు ఒక కథను ముందుగా ఒక హీరోకు వినిపించటం ఆ హీరోకు ఆ కథ నచ్చకో లేదా నిర్మాత దొరక లేదా ఏదైనా కారణం చేతో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వెంటనే అదే కథను ఆ దర్శకుడు మరో హీరో కి చెప్పి సినిమా చేయడం కామన్్‌. అయితే ఇక్కడే అనేక ఆస‌క్తిక‌ర అంశాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరోకు కథ నచ్చక సినిమా వదులుకుంటే ఆ కథను మరో హీరో చేసి హిట్లు లేదా సూప‌ర్ హిట్లు కొడుతూ ఉంటారు. అలా ముందు కథను రిజెక్ట్ చేసిన హీరోలు హిట్ సినిమాలు మిస్ అవుతారు. అలాగే ఒకరు వదులుకున్న కథను మరో హీరో చేసి డిజాస్ట‌ర్ ఇచ్చిన‌ సందర్భాలు ఉంటాయి.
ఉదాహ‌ర‌ణ‌కు మ‌హేష్ బాబు 2007లో వ‌చ్చిన అతిథి సినిమా త‌ర్వాత మూడేళ్ల పాటు సినిమాలు చేయ‌లేదు. ఆ టైంలో మ‌హేష్ కోసం క‌థ రెడీ చేసుకున్న ఎంతో మంది ద‌ర్శ‌కులు మ‌హేష్ కు క‌థ చెప్పి రిజెక్ట్ చేయ‌డంతో వేరే హీరోతో చేసి హిట్లు కొట్టారు. ఈ మూడేళ్ల‌లో మ‌హేష్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు మిస్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్నో బ్లాక్ బస్ట‌ర్ సినిమాలు వ‌దులుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇత‌ర హీరోలు మిస్ అయిన కొన్ని సినిమాలు కూడా ఎన్టీఆర్ చేశాడు.
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మిస్ అయిన రెండు సినిమాలు అనుకోకుండా ఎన్టీఆర్ ఖాతాలో ప‌డ్డాయి. ఈ క‌థ‌లు ముందుగా ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాయి. ప్ర‌భాస్ వాటిని రిజెక్ట్ చేయ‌డంతో చివ‌ర‌కు ఎన్టీఆర్ చేశాడు. అందులో ఒక‌టి హిట్ అవ్వ‌గా... మ‌రొక‌టి డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ రెండు సినిమాలు ఏవో కాదు ఊస‌ర‌వెల్లి, బృందావ‌నం. ఈ రెండు సినిమాల్లో బృందావ‌నం హిట్ అయ్యింది. అయితే ఊస‌ర‌వెల్లి ప్లాప్ అయ్యింది. ఊస‌ర‌వెల్లికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఇక బృందావ‌నం సినిమాను వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: