పుష్ప సినిమా కోసం బ‌న్నీ అభిమానులు ఎప్ప‌టి నుంచో వేచి చూస్తున్నారు. ఈ సినిమా గురించి రోజు వార్త టాలీవుడ్‌లో చెక్క‌ర్లు కొడుతోంది. అలా వైంకుఠ‌ప‌రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్న అనంత‌రం అల్లు అర్జున్ తీసున్న‌సినిమా కావ‌డంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత పుష్ప‌కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీంతో వీరి క‌ల‌యిక‌లో వ‌స్తున్న పుష్ప సినిమాకు అంచ‌నాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. 


ఇప్ప‌టికే రిలీజ్ అయిన సినిమా పోస్టర్లు, అల్లు అర్జున్‌ ఇంట్రడక్షన్ వీడియోకు విపరీతంగా రెస్పాన్స్ వ‌చ్చింది, వ‌స్తోంది కూడా బ‌న్నికి వైవిధ్య‌మైన పాత్ర కావ‌డం గ‌తంలో ఎప్పుడు చేయని రీతిలో ఈ సినిమాలో క‌న‌బ‌డ‌నున్నాడు. గంధ‌పు చెక్క‌, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో  బ‌న్ని లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.  ఈ చిత్రం కోసం ఊర మాస్‌‌‌‌గా డీ గ్లామర్ లుక్‌‌‌‌లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించనున్నాడు.

  ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.  ఇప్పటి వ‌ర‌కు 80 శాతం వరకూ షూటింగ్ పూర్తయిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు విలన్లు ఉండనున్నారని ఫ‌స్ట్‌ నుంచి ప్ర‌చారం కొన‌సాగుతూ వ‌స్తోంది. మ‌ల‌యాళంలో వ‌చ్చిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టించిన  మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఎంపికై ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మరో విలన్ గా ప్ర‌స్తుతం తెర‌మీద‌కు వ‌చ్చింది.

  రియ‌ల్ హీరో సోనూసూద్ పుష్ప చిత్రంలో బ‌న్నీతో త‌ల‌ప‌డ‌నున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప‌రాజ్ కు ధీటుగా సోనూను విల‌న్‌గా మూవీ మేక‌ర్స్ ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో జులాయి సినిమా విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో హీరోకు స‌మానంగా విల‌న్ పాత్ర‌లో సోనూసూద్ న‌ట‌న అధ్బుతంగా ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంది. బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో ఈ రియ‌ల్ హీరో సోను బిజీ బిజీ గా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే సోను పుష్ప‌లో న‌టిస్తున్నాడో లేదో అన్న విష‌యం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒక వేళ బ‌న్ని సినిమాలో సోనుసూద్ న‌టిస్తే ప్రేక్ష‌కుల‌కు పండుగే. ఈ విష‌యంపై సోనూ కూడా స్పందించాల్సి  ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: