అల్లు రామలింగయ్య సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అయితే ఈయన కి ఆ పేరు ఎలా వచ్చిందో..? ఎక్కడ జన్మించారో..?  అనే విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

అల్లు రామలింగయ్య  1-10-1922 న పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు అనే ప్రాంతంలో జన్మించారు ఈయన. ఇక ఈయన తండ్రి పేరు అల్లు వెంకయ్య, తల్లి సత్యమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు ముగ్గురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరి కూడా ఉన్నది. వీరి తాత పాలకొల్లు ప్రాంతంలో పెద్ద ఆస్తిపరులుగా ఉండేవారు.

వీరి తాత దాన, ధర్మాలు చేయడంతో ఉన్న ఆస్తి మొత్తం కరిగించేశారు.ఇక అల్లు వెంకయ్య మాత్రం ఎంతో కష్టపడి వ్యవసాయం లోనే చాలా డబ్బును వెనక్కి తీసుకొని వచ్చారు. ఇక అల్లు రామలింగయ్య  ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టే వారు కాదు. తమ ఊర్లలో ఎవరైనా భార్య, భర్త  నాటకాలు వేస్తే , వారి వెనక వెళ్లి.. నేను కూడా వేస్తాను అని చెప్పి వెళ్లేవారట అల్లు రామలింగయ్య.

అలా నాటకాల వారిని, అల్లు రామలింగయ్య  విసిగించడంతో..3 రూపాయలు ఇస్తే భక్త ప్రహ్లాద నాటకంలో  ఒక పాత్ర వేయిస్తాం అని చెప్పారట ఆ నాటకాలు డైరెక్టర్. తమ ఇంట్లో వారికి తెలియకుండా వారి ఇంట్లో ఉన్న బియ్యాన్ని అమ్మి, మూడు రూపాయలు ఆ నాటకాల మేనేజర్ కు ఇచ్చాడు. అలా ఆ నాటకాల నుంచి తన నటనా జీవితాన్ని మొదలుపెట్టాడు అల్లు రామలింగయ్య.

ఇలా నాటకాలు వేసుకుంటూ తిరుగుతున్నాడని ఉద్దేశంతోనే.. తమ తల్లిదండ్రులు"కనక రత్నం" అనే ఒక అమ్మాయికి ఇచ్చి వివాహం చేశారు. ఇక ఈయన 1942 లో గాంధీజీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరిని బ్రిటిష్ ప్రభుత్వం జైల్లో వేయించింది. అందులో అల్లు రామలింగయ్య కూడా ఉన్నాడు. ఇక ఈయన ఉచితంగా వైద్య సేవలను అందించే వారు ప్రజలకు.

1952 లో గరికపాటి రాజారావు గారు, మద్రాస్ కి రమ్మని చెప్పి అక్కడ "పుట్టిల్లు"అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఉన్న సమయంలోనే అనేక సినిమాలు తన చెంతకు రావడం జరిగింది. ఇక ఈయన దాదాపుగా వెయ్యి సినిమాల వరకు నటించాడు.

అల్లు రామలింగయ్య గారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తమ గ్రామంలో ఉన్న"  క్షీర రామలింగేశ్వర స్వామి "దేవాలయం పేరు గా ఆయన పేరు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: