టాలీవుడ్ లో సినిమాలు విడుదల కావడం పై నిర్మాతలు మెల్ల మెల్లగా ఆలోచిస్తున్నారు. ఇన్నిరోజులు తమ సినిమాలను విడుదల చేయడానికి భయపడ్డా కూడా ఇప్పుడు ఓ రెండు సినిమాలు విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో వారిలో ధైర్యం వచ్చినట్లు అయింది. దాంతో తమ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేసుకునేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ శుక్రవారం సత్య హీరోగా నటించిన మరో చిత్రం విడుదల కాగా మరో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా కూడా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

దాదాపు 500కు పైగా థియేటర్లలో ఈ రెండు చిత్రాలు విడుదల కాగా అన్నిచోట్ల మంచి కలెక్షన్స్ సాధించడంతో ఈ సినిమాలు సూపర్ హిట్ నిలుస్తున్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల అప్డేట్లు ఇప్పుడిప్పుడే వస్తుండడంతో ఈ సినిమాలు కూడా త్వరలోనే విడుదల అవుతున్నాయి తెలుస్తుంది. f3 సినిమా నుంచి పాట, సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ నోటీస్ ఇంకా పెద్ద పెద్ద సినిమాల నుంచి అప్డేట్ లు ఇచ్చే విధంగా సదరు దర్శక నిర్మాతలు ముందుకు వెళ్తున్నారట.

ఏదేమైనా ఈ సరికొత్త పరిణామం టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆనందింప చేస్తుంది. మరోవైపు సంక్రాంతికి 5 భారీ సినిమాలు విడుదల అవుతుండటం వారిని సంతృప్తి పరుస్తుంది. ఆచార్య దృశ్యం 2,  అఖండ, టైగర్ వంటి వారి చిత్రాలు దసరా కానుకగా విడుదలవుతున్నాయి అని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మరియు కే జి ఎఫ్ రెండో భాగం కూడా అక్టోబర్ తర్వాత విడుదల కానున్నాయి.  సినిమాలు అన్నీ వస్తుండడంతో మునుపటిలా టాలీవుడ్ కళకళలాడుతుందనీ, మళ్లీ పుంజుకుని మంచి లాభాలను సాధిస్తుందని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వచ్చే వారం సినిమాల సంగతి ఏంటో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: