టాలీవుడ్ తెలుగు సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. అంతే సమానంగా విలన్ ల ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇక విలన్ ఎంత బాగా క్రూరంగా ప్రవర్తిస్తే, హీరోకి క్రేజ్ అంత పెరుగుతుంది. ఇకపోతే ఇటీవల కాలంలో మన నిర్మాతలు.. ఇతర భాష విలన్ల పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా వారు ఎక్కువ డిమాండ్ చేసినప్పటికీ , ఏమాత్రం వెనుకంజ వేయకుండా వారు అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తూ , వారిని మన తెలుగు సినీ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతిని కూడా, ఎంత ఖర్చయినా పర్వాలేదు.. అంటూ మన తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించే ప్రతి అవకాశాన్ని ఈయన తీసుకుంటున్నట్లు సమాచారం. ఉప్పెన  సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి , ఏకంగా రూ. మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.ఒక మరో నటుడు సముద్రఖనికి కూడా అలాగే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి, మన తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా సముద్రకని కనిపిస్తున్నారు. ఇకపోతే మరో నటుడు ఫహద్ ఫాజిల్ ను కూడా అంతే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చి మన తెలుగు సినీ ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. మలయాళంలో బాగా బిజీగా ఉన్న స్టార్ హీరో ఈయన. కాకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పుష్ప సినిమా కోసం పట్టుబట్టి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చారు. కేవలం తెలుగు లో విలన్ రోల్ చేయడం కోసమే అతనికి విజయ్ సేతుపతి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ముట్ట చెప్పినట్లు సినీ ఇండస్ట్రీలో సమాచారం.పరభాషా నటులకు మనవాళ్లు ఇంత ఇస్తుంటే, మరి టాలీవుడ్ విలన్ లు సంగతేంటి..! వారు ఏమవ్వాలి..? అని మరికొంతమంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: