సినిమా పరిశ్రమలో నటులుగా రాణించాలంటే దేహదారుఢ్యం పై శ్రద్ధ వహించడం తప్పనిసరి. హీరోయిన్ లు అయితే జీరో సైజు కోసం, హీరో అయితే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తుంటారు. అంతేకాదు మినిమం బాడీ ఫిట్ గా ఉండాలి అలా అయితేనే తెరపైన అందంగా కనిపించి ఫిట్ గా కనిపించి ప్రేక్షకులను అలరిస్తారు. ఏది చేసినా చేయకపోయినా నటీ నటులు మాత్రం ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. తమ దేహాన్ని రకరకాలుగా మార్చుకుని ప్రేక్షకులను కనువిందు చేస్తూ ఉంటారు.

 ముఖ్యంగా హీరోయిన్ లు జీరోసైజ్ కోసం చేసే కష్టం అంతా ఇంతా కాదు. చాలీచాలని తిండి తింటూ ప్రేక్షకులను అలరించడానికి సైజులు మార్చేస్తు ఉంటారు. ఇలా తయారు చేయడంలో వారి పాత్ర ఎంతో ఉంటుందో సెలబ్రిటీ ట్రైనర్ ల పాత్ర కూడా అంతే ఉంటుంది. అలాంటి ఈ సెలబ్రిటీ ట్రైనర్ ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనకు నచ్చిన స్టార్స్ అలా ఉండడానికి అసలు కారణం వీళ్ళే .ఒక్కసారిగా తమ హీరో వేరియేషన్స్ ను మార్చి చూపిస్తూ ఈ ట్రైనర్లు తమదైన ప్రత్యేకత చూపిస్తారు. మన అభిమాన తారలు నెలలతరబడి ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలన్న వీళ్లు చెప్పినవి తప్పక పాటించాలి.

మహేష్ బాబు అక్కినేని సమంత అల్లు అర్జున్ వంటి వారికి ఫిజికల్ ట్రైనర్ గా ఉంటున్నాడు మినాష గాబ్రియేల్. ఆయన విలువైన సూచనలను పాటిస్తున్నారు కాబట్టే ఇప్పుడు తెరపై ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నారు వీరు. ఆయన చెప్పే హైబ్రిడ్ ఎక్సర్సైజ్ తుచా తప్పకుండా పాటిస్తే అందరూ ఎంతో ఫిట్ గా అవుతున్నారట. ఎక్సర్సైజ్ పై అవగాహన ఉన్నవారు ఇవి తప్పక తెలుసుకోవాలి పాటిస్తే మంచిది అంటున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన హైబ్రిడ్ ఎక్సైజ్ గురించిన వీడియో లు చూసి వెంటనే పాటించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: