ఈ మధ్యన సినీ నేపధ్యం లేకున్నా లేదా స్టార్ డం లేకపోయినా మంచి కథ ఉంటే ఎవరైనా హిట్ సాధించగలరని టాలెంటెడ్ హీరోస్ మరియు డైరెక్టర్స్ నిరూపిస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో మరో సినిమా థియేటర్లో విడుదలయ్యి విజయం దిశగా దూసుకుపోతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్‌‌ హీరో, హీరోయిన్ లుగా నటించిన చిత్రం 'తిమ్మరుసు' అస్సైన్మెంట్ అఫ్ వాలి అనేది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఈ సినిమాను  తెరకెక్కించారు. భారీ అంచనాల మద్య నిన్న విడుదలైన ఈ చిత్రం.. రెండవ దశ కరోనా ప్రభావంతో నీరసించిన థియేటర్లకు బూస్ట్ అప్ ఇచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని అంచనాలకు మించిన ఆదరణను పొందుతూ బాక్సాఫీస్ వద్ద తన దూకుడు చూపిస్తోంది 'తిమ్మరుసు' చిత్రం. హీరో సత్య దేవ్ నటనకు మరియు ఈ సినిమాను అద్భుతంగా  తెరకెక్కించిన డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి కి ప్రశంసల వర్షం కురుస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్ లో ట్విస్ట్ లు , సస్పెన్స్ లు, మరో వైపు కామెడీ పండించిన విధానం దర్శకుడి ప్రతిభను చాటి చెప్పింది. దాంతో 'తిమ్మరుసు' డైరెక్టర్ కు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాత  సురేశ్ దగ్గుబాటి ప్రొడక్షన్ నుండి తిమ్మరుసు డైరెక్టర్ శరణ్ కొప్పిసెట్టికి పిలుపు వచ్చనట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. నూతన దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ దగ్గుబాటి దర్శకుడు శరణ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో సినిమా తీద్దామని మంచి కథను రెడీ చేసుకుని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ అంశంపై పూర్తి వివారలు తెలియాల్సి ఉన్నాయి.  

ప్రస్తుతం 'తిమ్మరుసు' చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుని థియేటర్ ల వద్ద కలెక్షన్ ల మోత మోగిస్తోంది. ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. టేకింగ్ మాత్రమే కాదు కథను నడిపిన తీరు, ముగించిన విధానానికి కూడా దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయి. మరి ఎంతో మంది దర్శకుల లాగే మొదటి సినిమాతో హిట్ కొట్టి, కనుమరుయినట్టుగా శరణ్ కొప్పిశెట్టి కూడా ఆ లిస్ట్ లో చేరుతాడా ? లేదా ఈ విజయాన్ని తన సినీ కెరీర్ కు బంగారు బాటలు వేసుకుంటాడా చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: