టాలీవుడ్ సినీ పరిశ్రమలో సుమన్ గురించి తెలియని వారు ఉండరు. అప్పటి కాలంలో సుమన్ కి ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా అమ్మాయిల అభిమానులు ఎక్కువగా ఉండే వారు ఆయనకు.  అప్పటి స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చిన సుమన్ ఒక్కసారిగా డౌన్ అవడంతో ఆయన సినిమా లకు క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు సుమన్.  ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నాడు.

ఆయన నటనకు అందానికి ఎటువంటి వంక పెట్టడం అవసరం లేదు కానీ ఆయన ప్రవర్తన కారణంగా చాలా సినిమాలు విడిచి వెళ్లాయని ఒక ఆరోపణ ఇప్పటికీ ఉంది. ఆరోజుల్లో మంచి సినిమాలు చేస్తున్న సమయంలోనే తన ప్రవర్తన కారణంగా కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది దాని ద్వారా ఆయన ఫేడ్ అవుట్ అయిపోతూ వచ్చాడని చెబుతున్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో సుమను ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. నటుడుగానే ఉండాలనే కోరికతో ఆయన ఏ పాత్ర వచ్చినా కాదనకుండా చేస్తున్నాడు. ఇటీవలే ఆయన ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో విడుదల కావడంతో ఆ లుక్  వైరల్ గా మారుతుంది. 

స్టైలిష్ గడ్డం తో గాగుల్స్  పెట్టుకొని ఒకప్పటి సుమన్ గా ఎంతో అందం గా  కనిపిస్తున్నాడు. తమిళంలో వచ్చిన చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్న హీరో సుమన్ ని తన మిత్రుడు భానుచందర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చాడు. అయితే సుమన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఊహించని స్థాయిలో క్రేజ్ రావడంతో అపూర్వ ఆదరణ రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు .మార్షల్ ఆర్ట్స్ లో కూడా నైపుణ్యం ఉండటంతో అతనినీ యాక్షన్ హీరోగానే కాకుండా హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉండడంతో ఆయన అన్ని రకాల హీరోగా చూశారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: