సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా నటించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విజయం సాధించి స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. తండ్రితో కలిసి పలు సినిమాలలో నటించి నటన పరంగా మంచి అనుభవం సాధించిన మహేష్ బాబు రాజకుమారుడు అనే సినిమా ద్వారా పూర్తి స్థాయి హీరోగా మారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి జింటా హీరోయిన్ గా నటించగా మహేష్ బాబు నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 1999వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మణిశర్మ సంగీతం అందించగా మ్యూజికల్ హిట్ గా మలిచాడు.

ముంబైలో ఓ రెస్టారెంట్ నడుపుతుంటాడు ఓ వ్యక్తి. అతని మేనల్లుడు హీరో. ఒకసారి ఈ హీరో విహారయాత్రకు వెళ్లగా అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను తిరిగి ప్రేమించేలా చేసుకున్న హీరో ఆతర్వాత తన ప్రేమ కోసం ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ఎంతో సింపుల్ గా ఉన్న కథను కె.రాఘవేంద్రరావు తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమాను సూపర్ హిట్ గా మలిచాడు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కినేని ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డు దక్కించుకుంది. హిందీలో సైతం ప్రిన్స్ నెంబర్ వన్ సినిమా గా అనువాదం అయ్యింది. 

ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మాత్రమే కాకుండా మహేష్ బాబుకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 11 కోట్ల దాకా రాబట్టి మహేష్ బాబు కు సూపర్ హిట్ ఇచ్చింది. ఒక డెబ్యూ హీరో కి ఎన్ని కోట్లు కలెక్ట్ చేయడం అంటే అప్పట్లో పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. 44 సెంటర్లలో 100 రోజులు  పూర్తి చేసుకుని ఈ సినిమా మరచిపోని డెబ్యూ ను మహేష్ బాబుకు ఇచ్చింది. ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కాబోతోంది అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: