కోడి రామకృష్ణ.. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకరత్న గా గుర్తింపు పొందిన , దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా  పనిచేసి , ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈయన డిగ్రీ పూర్తి చేసుకొని, ఇక నటన మీద ఆసక్తితో దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ గా  చేరి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా దాసరి దగ్గర ఉన్న అన్ని మెళుకువలను తెలుసుకొని,  శ తర్వాత స్క్రీన్ ప్లే  కథ అనేవి ఎలా రాయాలో కూడా బాగా నేర్చుకున్నాడు. ఇక్కడ  గమనించాల్సిన విషయం ఏమిటంటే,  దర్శక రత్న కు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి నిర్మాతగా ఎవరైతే సహాయం చేశారో,  ఇక వారే కోడిరామకృష్ణ కు  కూడా దర్శకుడిగా సినీ అవకాశం ఇచ్చారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత కె.రాఘవ.

అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సారిగా చిరంజీవి హీరోగా నటించిన "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"  అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు నిర్మాత కి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య వివాదాలు జరిగిన తర్వాత 1981 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పెద్ద వివాదమే జరిగింది. ఎందుకంటే కోడి రామకృష్ణ మొదటి సినిమా  తరంగిణి అనే సినిమాతో,  దర్శకుడు అవ్వాలని అనుకున్నారు.  కానీ కలిసి రాక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే పేరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే ఈ సినిమా ఏకంగా 500 రోజులు ఆడి,  ఇప్పటికీ తన  రికార్డ్ ను తానే ( చిరంజీవి )బ్రేక్ చేయలేదని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, హీరోకి ఉన్న గుర్తింపు ఇక్కడ కోడి రామకృష్ణ కు కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆయన చేతికి ఎక్కువగా తాళ్ళు ,వేళ్లకు ఉంగరాలు ఉండటం మనం గమనించే ఉంటాము . ఇవన్నీ ఆయన సెంటిమెంట్ కోసమే అలా కట్టుకున్నారట. ముఖ్యంగా కోడి రామకృష్ణ కి నుదుట కట్టు, చేతికి రంగురంగుల దారాలు, రకరకాల ఉంగరాలు చాలానే వున్నాయి.

ఇకపోతే ఈయన మొదటి సినిమా భారీగా హిట్ అయ్యింది. కానీ సినిమా అవకాశాలు రాలేదు. ఇక దాంతో మ్యూజిక్ డైరెక్టర్ జైవి రాఘవ ఇచ్చిన సలహా మేరకు మురుగన్ స్వామి కి మొక్కుకున్నాడు. రెండవ పిక్చర్ కూడా హిట్ అయితే, జీవితాంతం నీ ఉంగరం పెట్టుకుంటాను అని కోరుకున్నాడట. రెండవ సినిమా తరంగిని కూడా దాదాపుగా 500 రోజులు ఆడింది . ఇక అప్పటి నుంచి మురుగన్ స్వామి ఉంగరం పెట్టుకోవడం ఈయనకు అలవాటు. ఇక మరొక క్యాస్టూమర్ సలహా మేరకు , తలకు కట్టుకోవడం గమనార్హం. అంతేకాదు అమ్మవారి సినిమాలను బాగా చేస్తాడు కాబట్టి దుష్టశక్తులను దరిచేరకుండా , పూజారులు చేతికి దారాలు కట్టారు. ఇక ఇలా ఇవన్నీ ఆయన సెంటిమెంట్ గా  ఆయనతో పాటే ఎప్పటికీ మిగిలిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: